50 ఏళ్ల వయసులోను టీనేజ్ బాయ్‌ఫ్రెండ్‌తో డేటింగ్.. పెళ్లి లేకుండానే ఆఫైర్లతో సుస్మిత సేన్ రచ్చ
బాలీవుడ్ నటి, మోడల్ సుష్మితా సేన్ వయస్సు పెరుగుతున్నా కొద్దీ షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటోంది. 50 ఏళ్ల వయస్సు వచ్చినా ఈ ముద్దుగుమ్మ పెళ్లికి దూరంగా ఉంటోంది. అంతే కాదు ఒకరి తర్వాత ఒకరితో డేటింగ్ చేస్తూ షాక్ ఇస్తోంది. ఇటీవల బడా వ్యాపార వేత్తతో బ్రేకప్ చేసుకున్న సుష్మితా సేన్ తాజాగా యంగ్ బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ చేస్తూ రచ్చ చేస్తోంది. ఇంతకు అతను ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతూ కనిపిస్తుండటం హాట్ టాపిక్ గ్గా మారింది. ఆ వివరాల్లోకి..
సుష్మితా సేన్ కుటుంబ వివరాలు..
బాలీవుడ్ నటి సుష్మితా సేన్ 1975 నవంబర్ 19న జన్మించింది. హైదరాబాద్ కు చెందిన బెంగాలీ బైద్య కుటుంబంలో సుష్మితా సేన్ పుట్టింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ వింగ్ కమాండర్ షుబీర్ సేన్, జ్యువెలరీ డిజైనర్ సుబ్ర సేన్ దంపతులకు కూతురామె. సుష్మితా సేన్ కు రాజీవ్ సేన్ తమ్ముడు కూడా ఉన్నారు. ఆయన టెలివిజన్ రంగంలో పనిచేశారు. నటుడిగా పలు ప్రాజెక్ట్స్ ను చేయడం విశేషం. ఇక ఆమె సికింద్రాబాద్‌లోని సెయింట్ ఆన్స్ హై స్కూల్‌లో విద్యభ్యాస్యాన్ని పూర్తి చేశారు. అలాగే ఢిల్లీ యూనివర్సీటీలో స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్‌లో పొలిటికల్ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీలో చేరింది. కానీ పూర్తి చేయలేదు.

సుష్మితా సేన్ ఎఫైర్స్..
టాలీవుడ్ సీనియర్ నటి సుష్మితా సేన్ 2004లో నటుడు రణదీప్ హుడాతో ప్రేమలో పడింది. 2006 వరకు అతనితో డేటింగ్ లో మునిగి తేలింది. ఆ తర్వాత బ్రేక్ చెప్పుకున్నారు. ఇక 12 ఏళ్ల గ్యాప్ తర్వాత ప్రముఖ మోడల్ రోహ్మాన్ షాల్ తో పరిచయం ఏర్పడింది. ఇక 2018 నుంచి 2022 వరకు అతనితో రిలేషన్ షిప్ లో ఉన్నట్టు ప్రకటించింది.
ఆ తర్వాత మళ్లీ బ్రేక్ చెప్పి వార్తల్లో నిలిచింది. ఆ నెక్ట్స్ ఇండియన్ బడా వ్యాపారవేత్త, క్రికెట్ నిర్వాహకుడు లలిత్ మోడీతో డేటింగ్ లో ఉన్నట్టు ప్రకటించింది. ఆమె అతనితో కలిసి కొన్ని ఫొటోలను కూడా పంచుకోవడంతో వార్తలు గుప్పు మన్నాయి. ఇక 2025 ఫిబ్రవరిలో లలిత్ మోడిని కూడా వీడింది. ఆ తర్వాత నుంచి ఎవ్వరితోనూ అఫీషియల్ గా తన డేటింగ్ ను ప్రకటించలేదు. కానీ కొన్ని రూమర్లు క్రియేట్ అవ్వడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
యంగ్ బాయ్ ఫ్రెండ్ తో రచ్చ..
లలిత్ మోడీతో సుష్మితా సేన్ విడిపోయిన తర్వాత తాజాగా యంగ్ బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ లో ఉన్నారని తెలుస్తోంది. ఈ మేరకు బాలీవుడ్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆమె అతనితో కలిసి ఒక ఈవెంట్లో కనిపించడం ఈ రూమర్లకు తెర లేపింది. దీంతో మళ్లీ సుష్మితా సేన్ కొత్త లైఫ్ ను ప్రారంభించిందని ప్రచారం జరుగుతుంది. మరోవైపు బిజినెస్ మెన్ రిమా బౌరీతో సుష్మితా మెన్ రిలేషన్ షిప్ లో ఉందంటూ కూడా ప్రచారం జరుగుతోంది. అందుకు సంబంధించిన ఫొటోలూ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.


Click it and Unblock the Notifications











