సుస్మితా సేన్ హృతిక్‌తో డేటింగ్ చేస్తోందా?
ముంబై: ఏంటి టైటిల్ చూసి షాకయ్యారా?.....టైటిల్‌లో తేడా ఏం లేదు, కానీ అతను బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ అని మాత్రం ఊహించుకోవద్దు. సుస్మితా సేన్ డేటింగ్ చేస్తుంది హోటల్ రంగంలో స్థిరపడ్డ హృతిక్ భాసిన్ అనే వ్యాపారితో అని బాలీవుడ్ సర్కిల్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మీడియా కథనాల ప్రకారం....సుస్మితా సేన్ ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్ హృతిక్ భాసిన్‌తో ఓ పార్టీకి హాజరైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పార్టీకి సుస్మితా సేన్ మాజీ బాయ్ ఫ్రెండ్ ఇంతియాజ్ ఖత్రి కూడా హాజరైనట్లు తెలుస్తోంది. సుస్మితా సేన్ తన కొత్త బాయ్ ఫ్రెండ్ హృతిక్ భాసిన్‌తో పార్టీలో ఎంట్రీ ఇవ్వగానే....ఇంతియాజ్ ఖత్రి అక్కడి నుంచి అసంతృప్తిగా వెళ్లి పోయినట్లు తెలుస్తోంది.

కొన్ని రోజుల క్రితమే సుస్మితా సేన్, ఇంతియాజ్ ఖత్రి మధ్య బ్రేకప్ అయింది. అయితే ఇద్దరి మధ్య దూరం పెరగడానికి కారణం ఏమిటో తెలియరాలేదు. విడిపోయిన తర్వాత సుస్మితాను చూడటానికి ఇంతియాజ్ ఖత్రి అస్సలు ఇష్టపడటం లేదని తెలుస్తోంది. 22 ఏళ్ల ఇంతియాజ్ ఖత్రితో సుస్మితా 2011లో డేటింగ్ ప్రారంభించింది. అయితే ఇది ఎంతోకాలం నిలవలేదు. ప్రస్తుతం ఆమె హృతిక్ భాసిన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











