For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బాహుబలి’ తల్లి గా నాగ్ హీరోయిన్

    By Srikanya
    |
    హైదరాబాద్ : ప్రభాస్ హీరోగా రాజవౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'బాహుబలి'.ఈ చిత్రంలో బాహుబలికి తల్లిగా నటించడానికి మంచి గుర్తింపు ఉన్న మాజీ హీరోయిన్ కావాలని వెతుకుతున్న సంగతి తెలిసిందే. అది ఎవరు? అని పలురకాల ఊహాగానాలు విన్పిస్తున్నాయి. తెలుగు,తమిళ,హిందీ భాషల్లో విడుదల కానుండటంతో మూడు చోట్ల తెలిసిన ఫేస్ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది.

    తాజాగా ఆ పాత్రలో విశ్వసుందరిగా ఎన్నికై, రక్షకుడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సుస్మితాసేన్ నటించనుందని మరో పేరు వార్తల్లోకి వచ్చింది. అప్పట్లో నాగార్జున హీరోగా నటించిన 'రక్షకుడు' చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా కనిపించింది. ఆ తర్వాత సుస్మితకు ఎలాంటి అవకాశాలు తెలుగులో రాలేదు.

    దాదాపుగా సుస్మిత గురించి తెలుగు ప్రేక్షకులు మరిచిపోతున్న తరుణంలో 'బాహుబలి' చిత్రంలో హీరో తల్లిగా నటించనుందన్న వార్తతో తెరపైకి వచ్చింది సుస్మిత. దర్శకుడు సుస్మితకు చిత్రంలోని ప్రధాన కథను, ఆమె పాత్రలో విశిష్టతను చెప్పడంతో, దాదాపు కోటి రూపాయల పారితోషికాన్ని ఇవ్వజూపడంతో సుస్మిత ఈ పాత్రను చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.

    అయితే కోటి రూపాయలు పెట్టి సుస్మితను తీసుకునే కన్నా తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు ఉన్న శ్రీదేవిని ఆ పాత్రకు ఎంపిక చేస్తే ఎలా ఉంటుందని, మరికొందరు సలహాలు ఇస్తున్నారట. శ్రీదేవి అయితే ఆ చిత్రానికి అదనపు ఆకర్షణ లభిస్తుందని కూడా వారు చెబుతున్నారు.

    ఐతే ఇంగ్లీష్-వింగ్లీష్ చిత్రంతో తాను హీరోయిన్ గానే నటిస్తానని చెప్పకనే చెప్పిన శ్రీదేవి ఇందుకు ఒప్పుకుంటుందా లేదా అనేది కూడా తెలియాలి. మొత్తానికి 'బాహుబలి' తల్లి ఎవరు అనేది మాత్రం ఇంకా ఖరారు కాని విషయమే! ఈ చిత్రం ఈనెల 14న షూటింగ్ ప్రారంభించుకోనుంది.

    ఈ విషయమై నిర్మాత దేవినేని మాట్లాడుతూ... మేము శ్రీదేవిని,సుస్మితాని కన్సిడర్ చేసిన మాట నిజమే. కానీ ఎవరనీ ఇంకా ఖరారు చేయలేదు. ఇంకా ఆప్షన్స్ వెతుకుతున్నాం..త్వరలోనే ఫైనలైజ్ చేస్తాం అన్నారు.

    English summary
    Director Rajamouli and producer Devineni Prasad are considering Sridevi and Sushmita Sen for a pivotal role in their upcoming project 'Bahubali'. The film will be released in three languages: Telugu, Tamil and Hindi. Producer Devineni admits to have considered both stars, but says, “We haven’t signed anyone yet; we are exploring various options including Sridevi and Sushmita. It will take a while to confirm the cast.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X