ఉత్కంఠ రేకెత్తిస్తున్న సస్పెన్స్?: అజ్ఞాతవాసిలో వెంకీ ఇలానా?, త్రివిక్రమ్ ఏం సెట్ చేశాడు..

Recommended Video

ఏంటీ సస్పెన్స్ ? అజ్ఞాతవాసిలో వెంకీ ఇలానా ?

స్టార్ హీరోల సినిమాలు రిలీజ్‌కు దగ్గరపడ్డాయంటే.. రోజుకో పుకారు పుట్టుకొచ్చేయడం కామన్. చూడబోతే.. పుకార్లన్నీ ఇప్పుడు అజ్ఞాతవాసి చుట్టే ముసురుకున్నట్లు కనిపిస్తున్నాయి. ట్రైలర్ రిలీజ్ డేట్ నుంచి మొదలుపెడితే.. కథ పైనా.. సినిమాలో వెంకీ పాత్ర పైనా లెక్కలేనన్ని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు మరొకటి తెర పైకి వచ్చింది..

ఏంటది

ఏంటది

అజ్ఞాతవాసి సినిమాలో పవన్ మేనమామగా వెంకీకనిపించబోతున్నారన్నది నిన్న మొన్నటి దాకా వినిపించిన టాక్. ఆయన తెరపై కనిపించినంత సేపు ఫుల్ కామెడీ ఉంటుందనే ప్రచారం జరిగింది. కానీ తాజా గాసిప్ ప్రకారం.. వెంకీ ఎంట్రీ ఇచ్చేది కామెడీ సీన్స్ లో కాదట.

 వెంకీ అంటే గుర్తొచ్చేది..:

వెంకీ అంటే గుర్తొచ్చేది..:

సాధారణంగా వెంకీ అనగానే ఎవరికైనా కామెడీ లేదా సెంటిమెంట్ గుర్తొస్తుంది. జెమినీ, ఘర్షణ లాంటి సినిమాల్లో యాక్షన్ తోనూ ఆయన ఇరగదీసినప్పటికీ.. ఆయన చేసిన ఎక్కువ పాత్రలు కామెడీ, సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్నవే కావడంతో.. ప్రేక్షకులకు ఆ పాత్రల్లోనే ఎక్కువగా గుర్తుండిపోయారు.

 వెంకీ-పవన్ ఫైట్ సీన్:

వెంకీ-పవన్ ఫైట్ సీన్:

అజ్ఞాతవాసి సినిమాలోనూ వెంకీ తనదైన కామెడీ టైమింగ్‌తో ఇరగదీస్తారని ఇప్పటిదాకా ప్రచారం జరిగింది. కానీ సినిమాలో ఆయన కనిపించేది ఓ ఫైట్ సీన్‌లో అని కొత్త కథనం తెర పైకి వచ్చింది. పవన్, వెంకీ కనిపించే ఈ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని త్రివిక్రమ్ భావిస్తున్నారట.

 అతడు, ఖలేజా లాగా?..:

అతడు, ఖలేజా లాగా?..:

ఫైటింగ్ సీన్స్ లోనూ కామెడీని మిక్స్ చేయడం త్రివిక్రమ్ స్టైల్. అతడు, ఖలేజా సినిమాల్లో కామెడీ మిక్స్ అయిన ఫైటింగ్ సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. కాబట్టి అజ్ఞాతవాసిలోనూ త్రివిక్రమ్ అలాంటి ప్రయత్నమే చేస్తున్నారా? అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 వెంకీ కాల్షీట్స్:

వెంకీ కాల్షీట్స్:

అజ్ఞాతవాసిలో వెంకీ పాత్రపై ఇప్పటివరకు క్లారిటీ రానప్పటికీ.. తెరపై ఆయన అదరగొట్టడం మాత్రం పక్కా అంటున్నారు. సినిమా కోసం ఆయన మూడు రోజుల పాటు కాల్ షీట్స్ కేటాయించారట.

 ఏంటా సస్పెన్స్?:

ఏంటా సస్పెన్స్?:

సినిమాలో వెంకీ కనిపించేది నాలుగు నిమిషాలే అయినా.. ఆ నాలుగు నిమిషాలు ప్రేక్షకులు చివరి వరకు మరిచిపోలేరట. ఆ స్థాయిలో పవన్-వెంకీ సీన్స్ రాసుకున్నారట త్రివిక్రమ్. అయితే ఆ సీన్స్ ఎలా ఉండబోతున్నాయన్న దానిపై ఊహాగానాలే తప్పితే ఎటువంటి క్లారిటీ లేదు. కాబట్టి.. ఈ సస్పెన్స్ ఏంటో తెలియాలంటే.. జనవరి 10న సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X