రామ్ చరణ్ ఆరెంజ్ చిత్రంలో సెకెండ్ హీరోయిన్ కన్ఫర్మ్
రామ్ చరణ్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో రూపొందనున్న 'ఆరెంజ్' చిత్రంలో సెకెండ్ హీరోయిన్ గా సుజాని అనే మోడల్ ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఆమె ప్రస్తుతం రిలీజుకు రెడీగా ఉన్న ఓ హిందీ చిత్రంలో నటిస్తోంది. ఇప్పటికే ఆమె చాలా యాడ్ ఫిలిమ్స్ లో కనిపించింది. అలాగే ప్రయాణం చిత్రంలో హీరోయిన్ ప్రెండ్ గా చేసిన ఆమెను కూడా మరో కీలకమైన పాత్రకు తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల పదకొండు నుంచి ఈ చిత్రం షూటింగ్ ముంబయిలో కంటిన్యూగా జరుగుతుంది. అనంతరం జనవరి 14న ఆస్ట్రేలియా బయిలుదేరి వెళతారు.
ఇక దాదాపు పదిహేను నిముషాల పాటు సాగే ఫ్లాష్ బ్యాక్ లో ఈ కొత్త హీరోయిన్ సుజాని కనపడుతుంది. వీటికి సంభందించిన సన్నివేశాలును ముంబాయి లో షూట్ చేస్తారు. అలాగే మెయిన్ హీరోయిన్ గా జెనీలియా కనపడతుంది. హాసిని గా బొమ్మరిల్లుగా అదరకొట్టిన ఆమె ఈ చిత్రంలోనూ ఓ విభిన్నమైన మ్యానరిజంతో అలరించనుందని తెలుస్తోంది. అంజనా ప్రొడక్షన్స్ పై నాగబాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో సెకెండ్ హీరోయిన్ కోసం కాజల్, శృతి హాసన్ వంటి ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే సుజాని మాత్రమే ఫైనలైజ్ అయింది.


Click it and Unblock the Notifications











