ఇదెక్కడి ట్విస్టూ, బాలయ్య అనవసరంగా రిస్క్ చేస్తున్నాడా???

Recommended Video

ఇదెక్కడి ట్విస్టూ..రిస్క్ ఏమో???

బాలకృష్ణ తన తదుపరి సినిమా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో చేయబోతున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం 'జై సింహా' షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా బాలయ్య ఆ షూటింగ్ పూర్తికాగానే డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డితో సెట్స్ పైకి రాబోతున్నాడని టాలీవుడ్ సర్కిల్‌లో ఓ వార్త షికారు చేస్తోంది.

బాలకృష్ణ

బాలకృష్ణ

ఈ న్యూస్ కాస్త షాకింగ్ గా వెరైటీగా అనిపించినా... ఊహించని దర్శకులతో పనిచేయడం బాలకృష్ణ కు కొత్తేమి కాదు. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే కొత్త దర్శకులకి అవకాశం ఇచ్చి ప్రయోగాలు చేసిన తెగింపు బాలయ్య దగ్గరుంది. అంతెందుకు...మొన్నటికి మొన్న లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సత్యదేవ వంటి చిన్న దర్శకుడితో సినిమా చేశాడు నటసింహం.

ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్

ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్

ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. గతంలో బాలయ్య, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో టాప్ హీరో సినిమా వచ్చింది. అందులో పాటలని బాగుంటాయి.కానీ సినిమా మాత్రం ఆడలేదు. మళ్లీ ఇన్నేళ్లకు బాలయ్యకు ఓ మంచి కథ వినిపించాడట ఎస్వీ కృష్ణారెడ్డి.

సినిమా తీసి కొన్నేళ్లయింది

సినిమా తీసి కొన్నేళ్లయింది

ప్రస్తుతం ఈ దర్శకుడు అస్సలు ఫామ్ లో లేడు. సినిమా తీసి కొన్నేళ్లయింది. అయినప్పటికీ... ఎస్వీ కృష్ణారెడ్డి చెప్పిన కథను విన్నాడట బాలయ్య. కథ కూడా బాగుందని మెచ్చుకున్నాడట. బాలకృష్ణ 100వ సినిమా సమయంలోనే ఆయనకి కథలు వినిపించిన దర్శకుల జాబితాలో ఎస్వీ కృష్ణారెడ్డి వున్నారనే టాక్ వినిపించింది.

'జై సింహా' షూటింగ్ పూర్తికాగానే

'జై సింహా' షూటింగ్ పూర్తికాగానే

కృష్ణారెడ్డి తోనే సినిమా వుండనున్నట్టు కొన్ని రోజుల పాటు ప్రచారం జరిగింది కూడా. అప్పుడు ఆయన వినిపించిన కథ బాలకృష్ణకి నచ్చిందట .. ఇప్పుడు ఆ సినిమాను మొదలు పెట్టడానికి బాలకృష్ణ ఆసక్తిని చూపుతున్నాడని అంటున్నారు. 'జై సింహా' షూటింగ్ పూర్తికాగానే, ఎస్వీ కృష్ణారెడ్డితో సినిమా ఉండొచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.

ఎన్టీఆర్ బయోపిక్

ఎన్టీఆర్ బయోపిక్

ఇదిలా ఉంటే తేజ దర్శకత్వంలో బాలకృష్ణ చేయనున్న ఎన్టీఆర్ బయోపిక్ ఎప్పుడా.. అనే సందేశం కలుగుతోంది ప్రేక్షకులకు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ కంటే ముందు తేజ వెంకటేష్‌తో ఓ సినిమా చేయనున్నాడు. వచ్చే నెల 13న ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నాడు తేజ.

పవర్‌ఫుల్ కథ

పవర్‌ఫుల్ కథ

వెంకటేష్‌ తో షూటింగ్ ఫినిష్ అయ్యాకే ఎన్టీఆర్ బయోపిక్ సెట్‌లో అడుగుపెట్టనున్నాడు తేజ. దీంతో ఈ లోగా బాలకృష్ణ కూడా ఎస్వీ కృష్ణారెడ్డితో సినిమా ఫినిష్ చేసే ఆలోచనలో పడ్డారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సారి బాలయ్యతో భారీ హిట్ సాధించేందుకు ఓ పవర్‌ఫుల్ కథను ఎస్వీ కృష్ణారెడ్డి సిద్ధం చేసి బాలయ్యకు వినిపించాడని, అందుకు బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారని టాలీవుడ్ వర్గాల సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X