యంగ్ హీరోతో Sv.కృష్ణా రెడ్డి కొత్త చిత్రం
మరోప్రక్క ఎన్నాళ్ళుగానే ఊరిస్తున్న ఎస్.వి.కృష్ణారెడ్డి హాలీవుడ్ చిత్రం 'డివోర్స్ ఇన్విటేషన్'(Divorce Invitation)విడుదలకు సిద్దమైంది. అతి త్వరలోనే విడుదల తేదీ ఖరారు చేసి ప్రకటన ఇవ్వనున్నారని సమాచారం. దర్శకునిగా తన 19 ఏళ్ల కెరీర్‌లో 'రాజేంద్రుడు-గజేంద్రుడు' మొదలుకుని 'మస్త్' వరకూ 38 చిత్రాలు డెరైక్ట్ చేసిన ఎస్వీకె హాలీవుడ్‌లో అడుగుపెట్టారు. డివోర్స్ ఇన్విటేషన్ పేరుతో ఆయన హాలీవుడ్‌లో చేసిన సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
గత రెండు మూడు సంవత్సరాలుగా ఎస్వీ కృష్ణా రెడ్డి ఈ సినిమా నిర్మాణంలోనే తలమునకలై ఉన్నారు. తెలుగులో హంగామా, సామాన్యుడు, డాన్ శీను, బిజినెస్ మేన్ వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించి అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగిన ఆర్.ఆర్.మూవీమేకర్స్ సంస్థ ఈ 'డివోర్స్ ఇన్విటేషన్'ను నిర్మించడం విశేషం.
రొమాంటిక్ కామెడీ చిత్రంగా రూపొందిన ఈచిత్రంలో అందరూ హాలీవుడ్ నటులే నటించారు. ఇప్పటికే 38 తెలుగు సినిమాలకు దర్శకత్వం వహించిన అనుభవం ఉన్న ఎస్.వి.కృష్ణారెడ్డి చాలా గ్యాప్ తీసుకుని ఏకంగా హాలీవుడ్ సినిమాతో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నారు. ఈచిత్రానికి గాను ఆయన బాలారాజశేఖరునితో కలిసి స్ర్కిప్టు వర్క్ చేశారు.


Click it and Unblock the Notifications












