పుట్టిన రోజునే ‘సీతమ్మ వాకిట్లో...’ఆడియో విడుదల

By Srikanya

హైదరాబాద్: వెంకటేష్- మహేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఆడియో విడుదల తేదీని ఫిక్స్ చేసినట్లు సమాచారం. వెంకటేష్ పుట్టిన రోజున ఈ ఆడియోని విడుదల చేయనున్నారు. అంటే డిసెంబర్ 13న ఈ ఆడియో విడుదల అవుతుందన్నమాట. వేలాది మంది వెంకటేష్ ప్యాన్స్,మహేష్ ప్యాన్స్ సమక్షంలో గ్రాండ్ గా ఈ చిత్రం ఆడియో చేయాలని దిల్ రాజు ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆడియో విడుదల తేదీ నుంచి ఈ చిత్రం ప్రమోషన్ పూర్తి స్ధాయిలో ప్రారంభిస్తారు.

మహేష్ సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి నటిస్తున్నారు. వెంకీ-మహేష్ అన్నదమ్ముళ్లుగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే టాలీవుడ్ లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అన్నదమ్ముల రిలేషన్ ఈ చిత్రంలో మెయిన్‌గా ఫోకస్ కానుంది. ఇక ఈ చిత్రం గురించి దిల్‌ రాజు మాట్లాడుతూ ..25 సంవత్సరాల తర్వాత వస్తున్న మల్టీస్టారర్‌ ఇది. వెంకీ, మహేష్‌ అన్నదమ్ము లుగా నటిస్తున్నారు. సీతమ్మ వాకిలి.. అంటే భారతదేశం, సిరిమల్లె చెట్టు..అంటే కుటుంబం అన్నారు.

ఈ చిత్రం గురించి దిల్ రాజు మాట్లాడుతూ... కేవలం పదిహేను నిమిషాలు మాత్రమే మహేష్ కథ విని 'ఓకే' చెప్పేశారు. ఈ కథలో ఉన్న గొప్పతనం అలాంటిది. అభిమానులనే కాదు... అన్ని వయసుల వారినీ అలరించే రీతిలో వెంకటేష్, మహేష్‌ల పాత్రలు సాగుతాయి అన్నారు. అలాగే... సీతమ్మ వాకిలి అంత పవిత్రమైన మనదేశంలో సిరిమల్లె చెట్టు లాంటి ఓ అందమైన కుటుంబం. అనుబంధాలకు నెలవైన ఆ ఇంట్లో జరిగిన అనూహ్య పరిణామాలే ఈ సినిమా. ఈ కథ విన్నవెంటనే చేయడానికి అంగీకారం తెలిపారు వెంకటేష్'' అని తెలిపారు.

మిక్కీ జె. మేయర్ అందించే ఈ చిత్రం లో పాటలు సినిమాకు బాగా ప్లస్ అవుతాయని,ఆడియో సూపర్ హిట్ అవుతుందని చెప్తున్నారు. రెండు పాటలు,ప్యాచ్ వర్క్ మినహా ఈ చిత్రం షూటింగ్ పూర్తైంది. సమంత, అంజలి, ప్రకాష్ రాజ్, జయసుధ, రోహిణి హట్టంగడి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, రమాప్రభ, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, రవిబాబు తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం: మిక్కీ జె. మేయర్, కెమెరా: కె.వి.గుహన్, కళ: ఎ.ఎస్. ప్రకాష్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత: దిల్ రాజు, కథ- స్క్రీన్ ప్లే- మాటలు- దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X