చరణ్ మూలంగానే మహేష్-వెంకీ వెనక్కి తగ్గారా?
హైదరాబాద్: విక్టరీ వెంకటేష్-సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. సక్రాంతి కానుకగా ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 13న వెంకీ బర్త్ డేను పురస్కరించుకుని ఆడియో విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయించారు.
తాజాగా అందిన సమాచారం ప్రకారం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఆడియో వెంకీ బర్త్ డే రోజు కాకుండా రెండు రోజులు ఆలస్యంగా అంటే....డిసెంబర్ 15న విడుదల చేయాలని నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వాయిదా వెనక మరో పుకారు కూడా షికార్లు చేస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన 'నాయక్' మూవీ ఆడియో డిసెంబర్ 14న విడుదల ఉండటం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నారట. మరి ఇందులో నిజా నిజాలు తేలాల్సి ఉంది.
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో వెంకటేష్, మహేష్ బాబు అన్నదమ్ములుగా నటిస్తున్నారు.
ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. వెంకటేష్ సరసన జర్నీ ఫేం అంజలి మరో హీరోయిన్ రోల్ చేసింది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ఈచిత్రాన్ని తెరక్కిస్తున్నారు. రోహిణి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, రమా ప్రభ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, సంగీతం: మిక్కీ జే మేయర్, సహనిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్, పాటలు: సిరి వెన్నెల సీతారామశాస్త్రి.


Click it and Unblock the Notifications











