రికార్డు స్థాయిలో ‘సీతమ్మ వాకిట్లో...’ శాటిలైట్ రైట్స్?
విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న మల్టీ స్టారర్ మూవీ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం విడుదలకు ముందు నుంచే సెన్సేషన్ సృష్టిస్తోంది. ఇద్దరు పెద్ద హీరోలు నటిస్తున్న సినిమా కావడం, ఫ్యామిలీ సెంటి మెంటుతో పాటు యూత్ మెచ్చే అంశాలు కూడా ఉండటంతో ఈ చిత్రంపై అన్ని వర్గాల్లోనూ భారీ అంచనాలున్నాయి.
ఈ నేపథ్యంలో ఈచిత్రం యొక్క శాటిలైట్ రైట్స్ దక్కించుకోవడానికి టీవీ ఛానళ్లు పోటీ పడుతున్నాయి. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఓ ప్రముఖ ఎంటర్ టైన్మెంట్స్ టీవీ ఛానల్ ఈచిత్రం యొక్క శాటిలైట్ రైట్స్ రూ. 8.5 కోట్లు చెల్లించి దక్కించుకున్నట్లు సమాచారం అందులోంది. ఇటీవల కాలంలో ఏ తెలుగు సినిమా కూడా ఈ రేంజిలో శాటిలైట్స్ రైట్స్ దక్కించుకోలేదనే చెప్పాలి.
కొత్తం బంగారు లోకం ఫేమ్ అడ్డాల శ్రీకాంత్ దర్సకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రను పోషిస్తున్నారు. మహేష్ సరసన సమంత,వెంకటేష్ సరసన అంజలి హీరోయిన్స్ గా చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది.
ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో సాగే కథే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. కథలో భావోద్వేగాలు అందరినీ కదిలిస్తాయి. వెంకటేష్, మహేష్‌బాబుల పాత్రలు అందరికీ గుర్తుండిపోతాయి. సీత పాత్ర కథలో చాలా కీలకం. ప్రకాష్‌రాజ్ మరోసారి ఓ ఉదాత్తమైన పాత్రలో కనిపిస్తారు. మల్టీస్టారర్ చిత్రాలకు ఈ సినిమా నాంది అవుతుంది అన్నారు.
ఆస్తిపాస్తుల ముందు అన్నదమ్ముల బంధాలకు విలువ లేని కాలమిది. చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష అనుకొంటూ ఎవరి బతుకులు వాళ్లు బతికేస్తున్నారు. ఇలాంటి రోజుల్లో కూడా నాన్న దగ్గర చేసిన వాగ్ధానం కోసం ఆ అన్నదమ్ములు ఏం చేశారో తెర మీదే చూడాలంటున్నారు దిల్ రాజు. సెప్టెంబర్లో ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications











