బాలకృష్ణ సరసన శ్వేతాబసు ఎంపిక?
సింహా చిత్రంలో బాలకృష్ణ సరసన చేసిన స్నేహా ఉల్లాల్ మిగతా జూనియర్ హీరోయిన్స్ కి ప్రేరణ ఇస్తున్నట్లుంది. తాజాగా కొత్త బంగారు లోకం ఫేమ్ శ్వేతాబసు ని కూడా బాలయ్య సరసన చేసేందుకు ఒప్పించినట్లు తెలుస్తోంది. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో బాలకృష్ణ చేయబోయే చిత్రంలో ఆమెను సెకెండ్ హీరోయిన్ గా అడిగారని ఫిల్మ్ నగర్ వార్త. ఇక ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. మొయిన్ హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఇక శ్వేతాబసు గతంలో బెల్లంకొండ నిర్మాతగా వచ్చిన రైడ్ చిత్రంలో హీరోయిన్ గా చేసింది. ఇక బెల్లంకొండ, బాలకృష్ణల కాంబినేషన్ లో ఇది మూడో చిత్రం. మొదట చెన్నకేశవ రెడ్డి, ఆ తర్వాత లక్ష్మీ నరసింహ చిత్రాలు బెల్లంకొండ భారీగా నిర్మించారు. ఇక ఈ పూరీ తో చేయబోయే చిత్రం గురించి బెల్లంకొండ...బాలయ్యబాబు కెరీర్ లోనే ఓ సెన్సేషనల్ మూవీగా నిలిచేవిధంగా హై రేంజ్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తాం అన్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాధ్...తన లేటెస్ట్ చిత్రం గోలీమార్ ప్రి రిలీజ్ హడావిడిలో ఉన్నారు. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన ప్రియమణి చేస్తోంది.


Click it and Unblock the Notifications











