కొత్త బంగారు లోకం చిత్రంతో పరిచయమై కుర్రకారుని ఊరించిన శ్వేతా బసు ప్రసాద్ ని లేటెస్ట్ గా చూసిన వాళ్ళు షాకవుతున్నారు. క్యూట్ గా ఉన్న ఈ చిన్నది హఠాత్తుగా నమిత షేప్ లతో బరువెక్కిందని అంటున్నారు. దాంతో ఆమెను జూనియర్ నమిత అంటున్నారు. ప్రస్తుతం ఆమె చేస్తున్న రైడ్ చిత్రం రషెష్ చూసిన వారు సైతం ఈ మాటే అనటంతో అంతటా ఇదో టాపిక్ అయింది. అందులోనూ ఆమె బంగారులోకంలో ఎక్సపోజింగ్ అదీ లేకుండా ఫ్యామిలీ తరహాలో కనిపించింది. మరి ఏమనుకుందో ఏమో రైడ్ కొచ్చేసరికి పూర్తిగా తన అందాలను చూపే పనలో పడిపోయింది. అంతేగాక సౌత్ లో నెగ్గుకురావాలంటే కాస్త ఒళ్ళు ఉండాల్సిందే అని కొత్త పాఠాలు సైతం చెప్తున్నట్లు వినికిడి. అయితే ఈ కొత్త ప్లాన్ బాగానే ఫలించిందంటున్నారు. రైడ్ షూటింగ్ లో ఉండగానే ఆమెకు వరస ఆఫర్స్ వస్తున్నాయని ఆమె మేనేజర్ చెప్తున్నారు. ఒక్క సినిమా మెరుపులా కాకుండా కొంత కాలం ఆమె నిలబడుతుందని, నటన ఎలాగో ఉంది కాబట్టి, అందం కూడా తోడవటం మంచిదేనని డైరక్టర్ సాబ్ లు శెలవిస్తున్నారుట. రైడ్ చిత్రానికి దర్శకుడు రమేష్ వర్మ. ఓ బైక్ చుట్టూ తిరిగే ఈ కథని బెల్లంకొండ సురేష్ తెరకెక్కిస్తున్నాడు. ఆయన కూడా శ్వేతాకు ఆఫర్స్ ఇస్తానని హామీ ఇచ్చారుట.