దిల్ రాజు వెంటపడి వేధిస్తున్న హీరోయిన్
దిల్ రాజు పరిచయం చేసిన బొద్దు గొమ్మ శ్వేతాబసు. ఆయన'కొత్త బంగారులోకం'తో ఒక్కసారిగా రాత్రికి రాత్రి స్టార్ గా మారిన శ్వేత బసు ప్రసాద్ ఆ తర్వాత దానిని నిలబెట్టుకోలేకపోయింది. సరైన సినిమాలు ఎంపికచేసుకోలేక, శరీరాన్ని సరిగ్గా మెయింటైన్ చేయక మిగిలిపోయింది. దాంతో రైడ్, కాస్కో, కళావర్ కింగ్ అంటూఒక్కో సినిమాకూ వెనక్కి వెళ్ళిపోసాగింది. ఇక ఆమె ఉదయ కిరణ్ తో చేసిన నువ్వేక్కడుంటే-నేనక్కడుంటా అయితే రిలీజ్ అవుతుందో లేదో కూడా తెలియని సిట్యువేషన్. ఇక ఆమె పరిస్ధితి ఎంత స్దాయికి వచ్చిందంటే...న్యూ ఇయర్ నైట్ వేడుకల్లో కాకినాడలో స్టేజిపై డాన్స్ చేసే స్ధితికి చేరుకుంది.
ఆమెను ఎంకరేజ్ చేసేవారు లేకపోవటంతో ఆమె ఇప్పుడు ఒళ్ళు తగ్గించి దిల్ రాజు వెనక పడుతోంది. తిరిగి తన కెరీర్ ని పట్టాలు ఎక్కించమని కోరుతోంది. అందులోనూ ఆమెను పరిచయం చేసిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మళ్ళీ డైరక్షన్ చేస్తూండటం, అదీ దిల్ రాజు నిర్మాత కావటం ఆమెకు మళ్ళి ఆశలు చిగురిస్తున్నాయి. అయితే దిల్ రాజు ఆమెను ఎంతవరకూ ఎంకరేజ్ చేస్తాడో చూడాలంటున్నారు. ప్రస్తుతం దిల్ రాజు..సిద్దార్ధ హీరోగా ఓ మై ప్రెండ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సిద్దార్ధ, శృతి హాసన్, హన్సిక నటిస్తున్న ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ అనే నూతన దర్శకుడు డైరక్ట్ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











