»   » పెగ్గేశాకే షూటింగ్ లేకుంటే గొడవే: జూనియర్ నమిత

పెగ్గేశాకే షూటింగ్ లేకుంటే గొడవే: జూనియర్ నమిత

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొత్త బంగారు లోకం సినిమా ద్వారా తెలుగు తెరపై పరిచయమైన శ్వేతా బసు ప్రసాద్ పై సినిమా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ బొద్దు అమ్మడు పెగ్గేయందే (వోడ్కా) షూటింగ్ కి రాదని, ఒక్కోసారి డోసు ఎక్కువై షూటింగ్ లో రచ్చరచ్చ చేస్తుందని ఇండస్ట్రీలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇటీవల నిఖిల్ తో కలిసి కళావర్ కింగ్ సినిమాలో నటించిన శ్వేత బసు ప్రసాద్ ఓ సారి ఫుల్లుగా తాగొచ్చి గొడవ చేసిందనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అంతే కాక షూటింగ్ సమయానికి మించి ఒక్క నిమిషం కూడా ఉండదని అత్యవసర షాట్లు తీయాలనుకునే సమయానికి ఏదో ఒక సాకు చెప్పి ఉడాయిస్తుందని ఆమె నటించిన సినిమాల్లో పని చేసిన వారంటున్నారు. ఏవో సాకులతో సాయంత్రం కాగానే షూటింగ్ కు డుమ్మా కొట్టి ఎంచక్కా తల్లి, స్నేహితులతో కలిసి మందులో మునిగి తేలుతుందట. ఈ అమ్మడు లావు కావడానికి కూడా ఈ అతి తాగుడే కారణమంట..ఇలా అయితే జూనియర్ 'నమిత" లా కనబడుతుందని చెవులు కొరుక్కుంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu