సినిమా, టీవీ..తర్వాత వ్యభిచారం: లీక్ చేసిన శ్వేతా బసు

By Bojja Kumar

హైదరాబాద్: ఇటీవల వ్యభిచారం కేసులో పట్టుబడిన నటి శ్వేతా బసు పోలీసులు విచారణలో పలు షాకింగ్ విషయాలు బయట పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. పైకి రంగుల ప్రపంచంలా కనిపించే తెలుగు సినీ పరిశ్రమలో చీకటి కోణాలు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి.

సినిమా అవకాశాల పేరుతో చాలా మంది అమ్మాయిలను కొందరు సినీ పెద్దలు లైంగికంగా లొంగదీసుకుంటున్నారని శ్వేతా బసు వెల్లడించిందని, తనను కూడా ఇలానే చేసారని శ్వేతా బసు ఒప్పుకున్నట్లు సమాచారం. చాలా మంది సినిమా అవకాశాలు తగ్గిన తర్వాత టీవీ సీరియల్స్ వైపు చూస్తున్నారని, అక్కడ కూడా అవకాశాలు తగ్గిన తర్వాత ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్నారని, గత్యంతరం లేని పరిస్థితుల్లో వ్యభిచారం వైపు అడుగులు వేస్తున్నారని శ్వేతా బసు బయట పెట్టినట్లు ఫిల్మ్ నగర్ టాక్.

Swetha Basu says financial constraints forced her

పరిశ్రమలో తాను ఒక్కదాన్నే కాదని, చాలా మంది తనలా వ్యభిచారంలోకి దిగిన వారున్నారని శ్వేతా బసు పోలీసుల ముందు చెప్పినట్లు సమాచారం. అయితే తనను లైంగికంగా లొంగదీసుకున్న సినీ పెద్దల వివరాలు మాత్రం శ్వేతా బసు ప్రసాద్ బయటకు చెప్పక పోవడం గమనార్హం. అదే విధంగా తనలా వ్యభిచారంలో ఉన్న ఇతర హరోయిన్ల వివరాలు కూడా ఆమె బయటకు చెప్పడం లేదట.

అయితే శ్వేతా బసు వ్యవహారంపై.... పలువురు ఇండస్ట్రీ పెద్దలు ఆగ్రహంగా ఉన్నారు. కొంత మంది తప్పుడు దారిలో నడుస్తున్నారని పరిశ్రమ మొత్తంపై నిందలు వేయడం సరికాదని, శ్వేతా బసు లాంటి వారి వల్ల పరిశ్రమ పరువు పోతోందని అసంతృప్తిగా ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X