‘సైరా’ షూటింగుకు లేటుగా డైరెక్టర్... దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన మెగాస్టార్!

Recommended Video

Sye Raa Narasimha Reddy Updates : Chiranjeevi Directs A Scene In Movie | Filmibeat Telugu

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా నరసింహారెడ్డి' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. అయితే ఇటీవల సెట్స్‌లో చోటు చేసుకున్న ఓ విషయం హాట్ టాపిక్ అయింది.

దర్శకుడు సురేందర్ రెడ్డి సెట్స్‌కు గంట లేటుగా వచ్చారట. అయితే అప్పటికే చిరంజీవితో పాటు, మిగత యూనిట్ సభ్యులు, నటీనటులు వచ్చి సెట్లో వెయిట్ చేస్తుండటంతో మెగాస్టార్ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన చిరు

దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన చిరు

ఓ ముఖ్యమైన పని ఉండటం వల్ల సురేందర్ రెడ్డి రావడం ఆలస్యం అవుతుందని తెలిసి.... టైమ్ వేస్ట్ కాకుండా ఆయన వచ్చేలోపు ఓ చిన్న షాట్ డైరెక్షన్ చేశారట. డైరెక్టర్స్ టీమ్ అప్పటికే ప్రిపేర్ అయి ఉండటంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా షాట్ పూర్తి చేశారట.

ఆశ్చర్యపోయిన సురేందర్ రెడ్డి

ఆశ్చర్యపోయిన సురేందర్ రెడ్డి

సెట్స్‌కు చేరుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సీన్ డైరెక్ట్ చేశారని తెలిసి ఆశ్చర్యపోయారని, యూనిట్ సభ్యులు సైతం మెగాస్టార్ డైరెక్షన్ చేసిన తీరు చూసి ముద్ధులైపోయారని సమాచారం.

గతంలోనూ మెగాస్టార్

గతంలోనూ మెగాస్టార్

అయితే మెగాస్టార్ ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు... గతంలో కూడా ఆయన తన సినిమా షూటింగ్స్ సమయంలో దర్శకులకు ఇలాంటి చిన్న చిన్న హెల్ప్ చేశారు. మెగాస్టార్‌కు ఉన్న అనుభవం దృష్ట్యా ఆయనకు ఇలాంటివి హ్యాండిల్ చేయడం చాలా తేలికే అని అంటున్నారు ఇండస్ట్రీకి చెందినవారు.

 సైరా నరసింహారెడ్డి

సైరా నరసింహారెడ్డి

కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. 2019 సమ్మర్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగులో బాహుబలి తర్వాత ఆ స్థాయిలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇదే. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు, తమన్నా లాంటి స్టార్స్ సైతం ఇందులో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X