»   » మెగాస్టార్ ‘సై రా’ రిలీజ్.... అ డేట్ ఫైనల్ అవుతుందా?

మెగాస్టార్ ‘సై రా’ రిలీజ్.... అ డేట్ ఫైనల్ అవుతుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా‌స్టార్ చిరంజీవి కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్న చిత్రం 'సై రా.... నరసింహారెడ్డి'. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మెగా తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దాదాపు రూ. 150 కోట్ల బడ్జెట్‌ ఖర్చు చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం 2019లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవి కెరీర్లోనే బిగ్గెస్ట్ యాక్షన్ చిత్రంగా దీన్ని మలిచే ప్రయత్నంలో ఉన్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి.

మే 9వ 'మహానటి' చిత్రం విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'సై రా' రిలీజ్ డేట్ హాట్ టాపిక్ అయింది. వచ్చే ఏడాది మే 9న 'సైరా' చిత్రం విడుదలయ్యే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. తెలుగు సినిమా చరిత్రలో ఇది మ్యాజిక్ డేట్‌గా పేరొందడం, గతంలో మెగాస్టార్ నటించిన చిత్రాలు కొన్ని ఇదే తేదీన విడుదలై చారిత్రక విజయాలు సాధించడంతో ఇదే డేట్‌ను 'సైరా' విడుదలకు ఫిక్స్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

Sye Raa Narasimha Reddy release on next year May 9th

చిరంజీవి కెరీర్లో ఎవర్ గ్రీన్ బిగ్గెస్ట్ హిట్ చిత్రాలుగా నిలిచిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 'గ్యాంగ్ లీడర్' గతంలో మే 9వ తేదీనే విడుదలవ్వడం గమనార్హం. దీంతో పాటు ఈ డేట్ సమ్మర్ హాలిడేస్ సీజన్ కావడం కూడా బాగా కలిసొచ్చే అంశం. అందుకే సైరా నరిసంహారెడ్డి చిత్రం మే 9న విడుదలయ్యే అవకాశం ఉందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

కాగా... 'సైరా' బడ్జెట్‌లో ఎక్కువ శాతం గ్రాఫిక్స్‌ కోసం ఖర్చు పెడుతున్నారు. ఈ వర్క్ పూర్తి కావడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి పోస్టు ప్రొడక్షన్ పనులు, విఎఫ్ఎక్స్ పనులు మొదలు పెట్టాలని దర్శకుడు ప్లాన్ చేసుకుంటున్నాడు. అన్ని అనుకున్నట్లు జరిగితే సరిగ్గా సంవత్సరం తర్వాత 'సైరా' ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary
Sye Raa Narasimha Reddy movie is one of the most prestigious movies in Chiranjeevi's career. There is a talk that the release date is going to be May 9th, 2019. Megastar's hit movies like Jagadeka Veerudu Athiloka Sundari, Gang Leader were released on May 9th and became industry hits. So, the makers are also planning to release the movie on the same date.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X