twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సైరా’.. రామ్ చరణ్ చెబుతున్న రేటుకు బయ్యర్ల బెంబేలు!

    |

    మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ 'బాహుబలి' స్థాయిలో ఉంటుందనే అంచనాలు అందరిలోనూ ఏర్పడ్డాయి. నిర్మాత రామ్ చరణ్ కూడా ఖర్చుకు ఏ మాత్రం వెనకాడకుండా దాదాపు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    'సైరా' చిత్రాన్ని దసరాకు ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైట్స్ దక్కించుకోవడానికి పలువురు బయ్యర్లు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రస్తుతం యూఎస్ఏ రైట్స్ విషయలో బేరసారాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

    రామ్ చరణ్ చెబుతున్న రేటుకు బయ్యర్ల బెంబేలు

    రామ్ చరణ్ చెబుతున్న రేటుకు బయ్యర్ల బెంబేలు

    యూఎస్ఏ రైట్స్ విషయంలో రామ్ చరణ్ చెబుతున్న రేటుకు యూఎస్ఏ బయ్యర్లు బెంబేలెత్తిపోతున్నట్లు సమాచారం. ఆయన 4 మిలియన్ డాలర్లు డిమాండ్ చేస్తుండగా బయ్యర్లు అంత పెద్ద మొత్తం పెడితే రిస్కులో పడతామని బార్గేనింగ్ చేస్తున్నారట.

    మెగాస్టార్ గత చిత్రం..

    మెగాస్టార్ గత చిత్రం..

    మెగాస్టార్ నటించిన కంబ్యాక్ మూవీ ‘ఖైదీ నెం. 150' యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద 2.4 మిలియన్ గ్రాస్ వసూలు చేసింది. ప్రస్తుతం అంతకంటే ఎక్కువే వసూలయ్యే అవకాశం ఉన్నప్పటికీ రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉండటంతో 4 మిలియన్ డాలర్ల భారీ మొత్తం వెచ్చించడానికి బయ్యర్లు ఇష్టపడటం లేదు.

    బాహుబలి రేంజి సినిమా కాబట్టే...

    బాహుబలి రేంజి సినిమా కాబట్టే...

    ‘సైరా' చిత్రం బాహుబలి స్థాయి సినిమా, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు, మెగాస్టార్ నటిస్తున్న మెగా మూవీ... ఆ స్థాయి మూవీకి 4 మిలియన్ డాలర్ కూడా పెట్టకుంటే ఎలా అంటూ రామ్ చరణ్ తరుపు ప్రతినిధులు బేరసారాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

    ఒక్కటే మార్గం..

    ఒక్కటే మార్గం..


    అయితే ఇటు నిర్మాత రామ్ చరణ్ నష్టపోకుండా, అటు బయ్యర్లు రిస్క్ ఫేస్ చేయకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం. ప్రాఫిట్ షేరింగ్ పద్దతిలో రైట్స్ అమ్మడమే బెటర్ అని కొందరు చూచిస్తున్నారు. మరి రామ్ చరణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

    మెగాస్టార్ వార్నింగ్‌

    మెగాస్టార్ వార్నింగ్‌

    సినిమా అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడం, ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుండటంతో చిరంజీవి ఇటీవలే దర్శకుడు సురేంద్ రెడ్డికి క్లాస్ పీకి వార్నింగ్ ఇచ్చారట. ప్రస్తత పరిస్థితి ప్రకారం చూస్తే సినిమా షూట్ ఏప్రిల్ లేదా మే నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. దసరా సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    Ram Charan is said to be demanding 4 million dollars for “Sye Raa Narasimha Reddy” US Rights. The patriotic period drama is gearing up for Dussera release this year. Directed by Surender Reddy, Ram Charan is producing it on his own.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X