సైరాలో యాడ్ కానుందా? లేక అంతవరకే పరిమితమా? ఫిలింనగర్‌లో ముదురుతున్న చర్చలు

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక సినిమా 'సైరా నరసింహా రెడ్డి'. ఆయన కెరీర్ లోనే తొలిసారి సైరా రూపంలో హిస్టారికల్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చారు చిరు. గత 150 సినిమాల్లో నటనతో పాటు డాన్స్ పరంగా అలరించిన చిరంజీవి సైరా నరసింహా రెడ్డిలో మాత్రం కేవలం యుద్ధ సన్నివేశాలపై, నటనపై ఫోకస్ పెట్టారు. అప్పటి పరిస్థితులకు అద్దం పట్టేలా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి క్యారెక్టర్‌లో లీనమై పోయారు.

చిరంజీవి గత సినిమాలకు భిన్నంగా సైరా నరసింహా రెడ్డిలో కేవలం మూడు పాటలతోనే సరిపెట్టారు. చిత్రీకరణ సమయంలో నాలుగు పాటలు అనుకొని ఆ నాలుగు పాటలు షూటింగ్ కూడా చేసేశారట. కానీ కథా పరంగా, నిడివి పరంగా నాలుగో పాటను తొలగించారని తెలిసింది. ఈ పాటలో తమన్నాతో కలిసి మంచి జోష్‌లో స్టెప్పులేశారట చిరంజీవి. సో.. సైరా ఊచకోత చూసిన ఆడియన్స్ అంతా ఇప్పుడు ఈ పాట గురించే చర్చించుకుంటున్నారు.

 Sye Raa Narasimhaa Reddy 4th song will Add shortly..?

షూటింగ్ సమయంలో తొలగించిన ఆ సాంగ్ 'సైరా నరసింహా రెడ్డి'లో కలిపేస్తే బాగుంటుందని చెప్పుకుంటున్నారు జనం. కాగా విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సైరా నాలుగో పాటను కేవలం సోషల్ మీడియాలో మాత్రమే విడుదల చేయాలనే ప్లాన్‌లో చిత్రయూనిట్ ఉన్నట్లుగా తెలిసింది. చూడాలి మరి ఈ సాంగ్ విషయంలో సైరా యూనిట్ ఎలా నిర్ణయం తీసుకుంటుంది అనేది.

ఇక సైరా సంగతులు చూస్తే.. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. చిత్రంలో అందరి నటనకూ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా సరికొత్త రికార్డుల దిశగా దూసుకెళ్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X