twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాకింగ్: చిరంజీవి, ప్రభాస్ పోటా పోటీగా బరిలోకి? దాని వల్ల నష్టమే...

    |

    ఒకే రోజు రెండు పెద్ద హీరోల సినిమాలు, అందులోనూ భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలైతే పరిస్థితి ఎలా ఉంటుంది? బాక్సాఫీసు వద్ద పోటా పోటీ వాతావరణం ఉంటుంది. రెండు సినిమాలు హిట్టయినా ఏదో ఒకటి పైచేయి సాధించడం సహజం. ఆ తర్వాత ఈ హీరోతో పోటీ పడలేక పోయినా ఆ హీరో.... ఇలా రకరకాల కంపేరిజన్స్ మొదలవుతాయి.

    ఒక సంక్రాంతి సీజన్లో తప్ప ఇతర సమయాల్లో రెండు బిగ్గెస్ట్ సినిమాలను విడుదల చేసే ప్రయత్నాలు జరుగవు. అయితే 2019లో ఇలాంటి సందర్భం ఒకటి చోటు చేసుకోబోతున్నట్లు తాజాగా ఫిల్మ్ నగర్లో ప్రచారం మొదలైంది.

    మెగాస్టార్ చిరంజీవి వర్సెస్ ప్రభాస్

    మెగాస్టార్ చిరంజీవి వర్సెస్ ప్రభాస్

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘సైరా నరసింహారెడ్డి'... యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సాహో' మూవీ ఒకే రోజు విడుదలకు సిద్ధం అవుతున్నాయట. ఆగస్టు 15, 2019లో ఈ రెండు సినిమాలు రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు మొదలైనట్లు టాక్.

    <strong>ప్రభాస్‌కు మళ్ళీ తిప్పలు.. వాడేసుకుంటున్నారు, రొమాంటిక్ సినిమా కోసం!</strong>ప్రభాస్‌కు మళ్ళీ తిప్పలు.. వాడేసుకుంటున్నారు, రొమాంటిక్ సినిమా కోసం!

     ‘సాహో'

    ‘సాహో'

    ‘బాహుబలి 2' తర్వాత మొదలైన ‘సాహో' షూటింగ్ ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. ఈ చిత్రాన్ని 2019 ప్రేక్షకుల ముందుకు తెస్తామని ముందే ప్రకటించిన చిత్ర బృందం గతంలో సంక్రాంతికి అనుకున్నారు. ఆ డేట్ కు సినిమా వచ్చే అవకాశం లేక పోవడంతో సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే ఇపుడు ఆగస్టు 15కు ఫిక్స్ అయినట్లు సమాచారం.

     ‘సైరా' ఆ డేట్ ఫిక్స్ అవ్వడానికి కారణమేంటి?

    ‘సైరా' ఆ డేట్ ఫిక్స్ అవ్వడానికి కారణమేంటి?

    ‘సైరా' చిత్రాన్ని కూడా ఆగస్టు 15వ తేదీనే విడుదల చేయాలని నిర్ణయించడానికి కారణం సినిమా కథ నేపథ్యమే అంటున్నారు. స్వాంతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం కాబట్టి స్వాంతంత్య్ర దినోత్సవం రోజున విడుదల చేస్తే బావుంటుందని భావిస్తున్నారట.

    అఫీషియల్‌గా ఖరారు కాలేదు

    అఫీషియల్‌గా ఖరారు కాలేదు

    ఆగస్టు 15, 2019 ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదలకు సిద్ధం అవుతున్నాయి అనేది కేవలం ఫిల్మ్ నగర్లో వినిపస్తున్న రూమర్స్ మాత్రమే. ఇవరు వర్గాలు తమ సినిమాల రిలీజ్ డేట్ అఫీషియల్‌గా ప్రకటించలేదు.

    ఒక వేళ అదే నిజమైతే నష్టమే

    ఒక వేళ అదే నిజమైతే నష్టమే

    ఒకవేళ ఈ రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు విడుదలైతే రెండు సినిమాల వసూళ్లపై ప్రభావం పడుతుందని, ఇది అంత మంచి పరిణామం కాదని, హిట్ టాక్ తచ్చుకున్నప్పటికీ వసూళ్ల పరంగా ఎంతో కొంత నష్టపోవాల్సి వస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

    English summary
    ‘Sye Raa‘ starring megastar Chiranjeevi in the title role might be eyeing 15th August release in 2019 as it will be perfect to release the biopic on a freedom fighter on our Independence Day. Film Nagar source said that Prabhas Saaho also coming in same day.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X