సైరా దర్శకుడికి పెద్ద హీరోలు దొరకడం లేదట.. అందుకే ఆ హీరోతో..
కిక్, రేసుగుర్రం వంటి కమర్షియల్ సినిమాలతో తన క్రేజ్ పెంచుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి ఆ తరువాత ధృవ సినిమాతో ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమాలు కూడా చేయగలను అని నిరూపించుకున్నాడు. కథ కనెక్ట్ అయితే ఈ దర్శకుడి మేకింగ్ అద్భుతంగా ఉంటుందని ఇండస్ట్రీలో ఇప్పటికే ఒక మంచి టాక్ ఏర్పడింది. అందుకే సైరా లాంటి ఆఫర్ ని కొట్టేశాడు.
మెగాస్టార్ ప్రతిష్టాత్మక చిత్రం సైరా రిలీజ్ కి ముందు ఏ రేంజ్ లో హడావుడి చేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కానీ రిలీజ్ తరువాత సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. మెగాస్టార్ కూడా ఆ సినిమా రిజల్ట్ పై చాలా నిరాశకు లోనయ్యారని టాక్ వచ్చింది. ఇకపోతే ప్రస్తుతం సురేందర్ రెడ్డికి నెక్స్ట్ ప్రాజెక్ కోసం స్టార్ హీరో దొరకడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం పెద్ద హీరోలు చాలా బిజీగా ఉన్నారు.

ఇన్ని రోజులు లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ లేకపోవడంతో ప్రస్తుతం అందరు ఒక్క సినిమాపైనే దృష్టి పెడుతున్నారు. దీంతో సురేందర్ రెడ్డి నెక్స్ట్ యంగ్ హీరో రామ్ పోతినేనితో ఒక కామెడీ ఎంటర్టైనర్ ని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ లో కొన్ని కథలు రెడీ చేసుకున్న ఈ దర్శకుడు రామ్ పోతినేనికి రెండు కథలను వినిపించగా అందులో రామ్ ఒక దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. త్వరలోనే ఈ కాంబినేషన్ పై స్పెషల్ ఎనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్.


Click it and Unblock the Notifications











