ముందు ఎవరు దొరికితే వారితోనే.. సైరా దర్శకుడి న్యూ ప్లాన్!
సైరా సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని బాగానే కష్టపడిన దర్శకుడు సురేందర్ రెడ్డి అనుకున్నంతగా అయితే అంచనాలను అందుకోలేకపోయారు. ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయగా తెలుగులో తప్పితే మిగతా చోట్ల పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలను తెరకెక్కించగలడని మాత్రం నిరూపించుకున్నాడు.
ఇక నెక్స్ట్ ఈ స్టార్ డైరెక్టర్ మళ్ళీ తన రెగ్యులర్ కంఫర్ట్ జోన్ లోనే ఒక కమర్షియల్ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే మూడు కథలను సెట్ చేసుకున్న సురేందర్ రెడ్డి హీరోలను వెతికే పనిలో పడ్డాడు. ముందుగా రామ్ కోసం ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత పవన్ కళ్యాణ్ తో కూడా చర్చలు జరుపుతున్నట్లు టాక్ వచ్చింది. ఇక అఖిల్ కోసం కూడా మాస్ యాక్షన్ కథను రెడీ చేసినట్లు రూమర్స్ వచ్చాయి.

ఇక ఇప్పుడు ఫైనల్ గా రవితేజతో కూడా సురేందర్ రెడ్డి ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియదు గాని సురేందర్ రెడ్డి మాత్రం ముందు ఎవరు దొరికితే వారితో సినిమా చేయాలని ఆలోచిస్తున్నాడట. కానీ వారి డేట్స్ దొరకడం కష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సైరా లాంటి పెద్ద సినిమా అనంతరం సురేందర్ రెడ్డి మిడియమ్ హీరోలను సెలెక్ట్ చేసుకోవడం కంటే ఆయన స్థాయికి తగ్గట్లు మరో పెద్ద హీరోను సెలెక్ట్ చేసుకుంటేనే బెటర్ అంటూ కొందరు సలహాలు ఇస్తున్నారట. మరి దర్శకుడు సురేందర్ రెడ్డి ఫైనల్ గా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











