twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓంకార్ గదిలో తాప్సి.. కన్ఫర్మ్!

    |

    తెలుగులో వచ్చే హారర్ జోనర్ సినిమాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది 'రాజుగారి గది' సినిమా. యాంకర్ ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చేసిన థ్రిల్ ప్రేక్షకలోకాన్ని బాగా ఆకట్టుకోవడంతో దీని సీక్వల్స్ తీసే పనిలో పడ్డారు దర్శకనిర్మాతలు. 'రాజుగారి గది' రెండో భాగంగా 'రాజుగారి గది 2' వచ్చింది. నాగార్జున, సమంత లీడ్ రోల్స్ పోషించిన ఈ సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆశించిన రిసల్ట్ రాబట్టలేకపోయింది. అయినా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా తాజాగా 'రాజుగారి గది 3' పేరుతో మరో సీక్వల్ మొదలు పెట్టాడు యాంకర్ కమ్ డైరెక్టర్ ఓంకార్.

    జూన్ 20 వ తేదీన ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది కూడా. ఓంకార్ దర్శకత్వంలో ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై తెరకెక్కనున్న చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా, అశ్విన్ లను లీడ్ రోల్స్ లో సెలెక్ట్ చేశారు. అయితే అంతా బాగానే ఉంది ఇక రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టేస్తారు అనే సమయంలో తమన్నా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని తెలిసింది. దీంతో మరో హీరోయిన్ వేట ప్రారంభించిన ఓంకార్‌కి హీరోయిన్ తాప్సి బెస్ట్ ఆప్షన్‌గా కనిపించిందట. ఇటీవల కాలంలో తాప్సి వరుసగా హారర్ సినిమాల్లో, ఫిమేల్ ఒరింటెడ్ సినిమాల్లో రాణిస్తోంది కాబట్టి 'రాజుగారి గది 3' లో ఆమెనే ఫైనల్ చేయాలని డిసైడ్ అయ్యారట ఓంకార్.

    Taapsee Pannu Confirmed in Raju Gari Gadhi 3 ?

    తమన్నా తప్పుకున్నాక నందిత శ్వేతను తీసుకోవాలని మొదట ఓంకార్ భావించారట కానీ ఆమెతో పోల్చితే తాప్సితో అయితే సినిమాకు వెయిటేజ్ ఎక్కువగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారట ఓంకార్. హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న 'రాజుగారి గది 3' చిత్రంలో ఊర్వ‌శి, అలీ, బ్ర‌హ్మాజీ, ప్ర‌భాస్ శ్రీను, హ‌రితేజ‌, అజ‌య్‌ఘోష్ తదితరులు నటించనున్నారు. చిత్రానికి ఛోటా కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందించనున్నారు. గతంలో వచ్చిన రెండు సినిమాను మించి హారర్, కామెడీ ఈ సినిమాలో జోడించనున్నారని తెలుస్తోంది.

    English summary
    Raju Gari Gadhi 3 movie starts regular shooting shortly. This movie is directed by Omkar. Raju Gari Gadhi 3 heroine Tamannaah getback from this project, then Omkar confirmed Taapsee Pannu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X