సమంత తల్లిగా నాగార్జున హీరోయిన్.. ఆ ఇండస్ట్రీ హిట్ తర్వాత మరోసారి ఇలా!

ఎలాంటి సపోర్ట్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయిన హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకడు. 'పెళ్లి చూపులు' అనే చిత్రంతో హీరోగా పరిచయమైన అతడు.. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను అందుకున్నాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే విజయ్ 'లైగర్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రేజీ కాంబినేషన్‌లో పాన్ ఇండియా రేంజ్‌లో వచ్చిన ఈ సినిమాకు ఆడియెన్స్ షాక్ ఇచ్చారు. దీంతో ఈ మూవీ డిజాస్టర్‌గా మిగిలింది.

టాలీవుడ్ క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' అనే సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తైంది. ఇందులో స్టార్ హీరోయిన్ సమంత నటిస్తోంది. గతంలో ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీనికి అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. అదే సమయంలో సినిమాపై అంచనాలు కూడా భారీగా ఏర్పడ్డాయి. దీంతో చిత్ర యూనిట్ వీలైనంత త్వరగా చిత్రీకరణను పూర్తి చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. కానీ, సమంత గైర్హాజరు వల్ల షూటింగ్ ఆలస్యం అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి ఓ ఆసక్తికరమైన న్యూస్ వైరల్ అవుతోంది.

Tabu Plays Samantha Mother Role in Kushi Movie

క్రేజీ కాంబినేషన్‌లో ఫీల్ గుడ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'ఖుషి' మూవీలో ఒకప్పటి అందాల తార టబు కూడా నటిస్తున్నారట. ఇందులో ఆమె హీరోయిన్ సమంత తల్లి పాత్రను చేస్తోన్నారని తెలిసింది. ఎంతో మోడ్రన్‌గా ఉండే ఈ రోల్‌కు సంబంధించిన షూటింగ్‌ కోసం ఆమె త్వరలోనే సెట్స్‌లోకి అడుగు పెట్టబోతున్నారని కూడా తెలుస్తోంది. ఇక, ఈ మూవీలో టబు రోల్ ఎంతో ప్రాధాన్యతతో కూడి ఉంటుందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇదిలా ఉండగా.. గతంలో టబు 'అల.. వైకుంఠపురములో' మూవీలో అల్లు అర్జున్ మదర్‌గా నటించిన విషయం తెలిసిందే.

Tabu Plays Samantha Mother Role in Kushi Movie

మంచి లవ్ స్టోరీతో రాబోతున్న 'ఖుషి' మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని,రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. దీనికి హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య తదితరులు కీలక పాత్రలను చేస్తోన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X