పవన్ కల్యాణ్‌కు సీనియర్ హీరోయిన్ షాక్.. బంపర్ ఆఫర్ ఇచ్చినా నో చెప్పేసిందా!

రీఎంట్రీ ఇచ్చిన తర్వాత టాలీవుడ్‌లోని మరో స్టార్ హీరో చేయనంత స్పీడుగా సినిమాలను పూర్తి చేసుకుంటూ దూసుకుపోతోన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇప్పుడు ఏకంగా నాలుగు ప్రాజెక్టులను ఏకకాలంలో చేస్తూ వస్తున్న అతడు.. వాటిని ఒక్కొక్కటిగా కంప్లీట్ చేసుకునేలా ప్లాన్ చేశాడు. ఇలా ఇప్పుడు పవన్ చేస్తున్న చిత్రాల్లో 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) ఒకటి.

టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ హీరోగా.. 'సాహో'తో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తోన్న మూవీనే 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) ఒకటి. యాక్షన్ జోనర్‌లో 1990 నాటి బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతున్న ఈ చిత్రంపై ఆరంభంలోనే హైప్ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.

Tabu Rejects Pawan Kalyan and Sujeeth OG Movie Offer

పూర్తి స్థాయి యాక్షన్‌తో రూపొందుతోన్న 'OG' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను గత ఏడాదిలోనే మొదలు పెట్టారు. అప్పటి నుంచి అస్సలు బ్రేకులు లేకుండా వరుసగా షెడ్యూళ్లను పూర్తి చేశారు. ఇలా ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించి యాభై శాతం వరకూ టాకీ పార్టును పూర్తి చేశారు. మిగిలిన దాన్ని కూడా త్వరలోనే కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'OG'మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు. అందుకే ఇందులో ఎంతో మంది టాలెంటెడ్ యాక్టర్లు నటిస్తున్నారు. ఇలా ఇప్పటికే కొందరి పేర్లను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని ఓ ముఖ్యమైన పాత్ర కోసం సంప్రదించగా సీనియర్ హీరోయిన్ టబు రిజెక్ట్ చేసినట్లు తాజాగా తెలిసింది.

Tabu Rejects Pawan Kalyan and Sujeeth OG Movie Offer

'OG' మూవీలో నెగెటివ్ షేడ్స్ ఉండే ఓ యాక్షన్ రోల్ కోసం సుజిత్.. సీనియర్ హీరోయిన్ టబునే ముందుగా సంప్రదించాడట. కానీ, ఆమె వ్యక్తిగత కారణాలతో దీన్ని రిజెక్ట్ చేసినట్లు తెలిసింది. ఆ తర్వాత ఈ పాత్ర కోసం చాలా మందిని పరిశీలించి.. శ్రీయా రెడ్డిని తీసుకున్నారని అంటున్నారు. ఏకంగా పవన్ మూవీ ఆఫర్‌నే టబు రిజెక్ట్ చేసిందన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

ఇదిలా ఉండగా.. 'OG' చిత్రాన్ని RRR ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయా రెడ్డి సహా ఎంతో మంది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ థమన్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X