నాగ చైతన్య సినిమాలో ఆమె?

ఇంతకు ముందు నాగార్జున మరో కుమారుడుతో చేసిన సిసింద్రీ చిత్రంలోనూ ఆమె ఐటం సాంగ్ లాగించారు. అలా నాగార్జున ఇంటి హీరోయిన్ అయిన టబు ఈ సినిమాలో నటించటంలో వింతేమి లేదని అంటున్నారు. అంతేగాక సినిమాకు ఓ విధమైన క్రేజ్ వస్తుందని అంటున్నారు. అలాగే ఆమె పాత్ర నాగ చైతన్య ను సినిమాలో లక్ష్యం వైపు ప్రేరేపించే రకంగా ఉంటుందని తెలుస్తోంది. అలాగే కాలేజి బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ కథలో జె.డి చక్రవర్తి విలన్ గా కనిపిస్తాడు. ఏక్షన్ సన్నివేశాలు హైలెట్ గా ఈ సినిమాలో చోటు చేసుకోనున్నాయని చెప్పుకుంటున్నారు. నూతన దర్శకుడు వాసు వర్మ పూర్తి స్ధాయి స్క్రిప్టుతో ఓ తపస్సులా దీన్ని రూపొందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











