28 ఏళ్ల తర్వాత ఇష్టమైన హీరోయిన్‌తో నాగార్జున.. 100 మూవీలో ఆ టాప్ హీరోయిన్ ఎవరంటే?
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని తన కెరీర్‌లో మరో అరుదైన మైలురాయిని దాటబోతున్నారు. విక్రమ్ సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఆయన పలు భాషల్లో నటిస్తూ మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా అన్ని తరాల సినీ ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నారు. వైవిధ్యమైన పాత్రలు, విలక్షణతో కూడిన నటనతో ప్రేక్షకులను రంజింప చేస్తున్న నాగ్ తన ప్రొఫెషనల్ లైఫ్‌లో 100వ చిత్రాన్ని పూర్తి చేయబోతున్నారు. ఓ నటుడిగా ఆయన అభిమానులకు ఇది గొప్ప విశేషమే. అయితే ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ చిత్రంలో ఆయన పక్కన నటించే హీరోయిన్ పేరు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. ఆ హీరోయిన్ ఎవరనే వివరాల్లోకి వెళితే..
నాగార్జున 100వ చిత్రం గురించి అనేక వార్తలు మీడియాలో వినిపించాయి. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని పలువురి పేర్లు బయటకు వచ్చాయి. అయితే చివరకు ల్యాండ్ మార్క్ సినిమాకు డైరెక్షన్ చేసే అవకాశం తమిళ దర్శకుడు రా కార్తీక్‌కు దక్కింది. అయితే ఆయన ఈ సినిమాను నాగార్జున ఇమేజ్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఆయన ఫ్యాన్స్‌కు కిక్కించే విధంగా మలిచే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం.

అయితే ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో మన్మథుడి పక్కన నటించే హీరోయిన్ ఎవరైతే బాగుంటుందనే విషయంపై చర్చ జరిగింది. అయితే అనూహ్యంగా సీనియర్ హీరోయిన్, బాలీవుడ్ నటి, నాగార్జునకు ఇష్టమైన వ్యక్తి టబు పేరు తెరపైకి వచ్చింది. నాగ్‌తో మరోసారి టబు నటించనున్నారనే వార్త నిజంగా సగటు సినీ ప్రేక్షకుడితోపాటు ఆయన అభిమానులకు సంతోషాన్ని కలిగించింది. అయితే ఈ వార్తపై ఎలాంటి ధృవీకరణ అధికారికంగా జరగకపోవడంతో మీడియాలో ఈ వార్త రూమర్‌గానే చెలామణి అవుతున్నది.
ఇక నాగార్జున, టబు కలిసి నటించి చాలా సంవత్సరాలైంది. దాదాపు 28 సంవత్సరాల క్రితం వారిద్దరూ కలిసి నటించారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఆవిడా మా ఆవిడే అనే సినిమాలో జంటగా కనిపించారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి నటించిన దాఖలాలు లేవు. దాంతో చాలా గ్యాప్ తర్వాత ఇద్దరు హీరో, హీరోయిన్లుగా కనిపించబోతున్నారనే విషయం నిజంగానే ఆసక్తికరంగా మారింది.
గతంలో నాగార్జున అక్కినేని, టబు కలిసి నటించిన చిత్రాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాయి. వారిద్దరి మధ్య రొమాన్స్, పాత్రల కెమిస్ట్రీ ఇప్పటి తరానికి కూడా ఫేవరేట్‌గా మారాయి. నిన్నే పెళ్లాడుతా చిత్రంలో వారిద్దరు కలిసి నటించిన తీరు ఎవర్ గ్రీన్‌గానే ఉంటుంది.
నాగార్జున కెరీర్ విషయానికి వస్తే.. ఆయన కూలీ, కుబేరా లాంటి విభిన్నమైన పాత్రలతో కనిపించి మెప్పించారు. తమిళంలో పాపులారిటీ ఉన్న తమిళ డ్రామా అయోతీ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతున్నది. ఈ సినిమాను తెలుగు, తమిళ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.


Click it and Unblock the Notifications











