Don't Miss!
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్‌గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Sports SRH ఎఫెక్ట్‌తో IPLలో కొత్త రూల్: బౌలర్లకు గుడ్ & బ్యాటర్లకు బ్యాడ్ న్యూస్!
- Technology 200MP కెమెరాతో వచ్చే Honor 90 ఫోన్ పై భారీ ఆఫర్! తక్కువ ధరకే పొందండి
- News రాయలసీమ నెత్తిన పాలు పోసిన మోడీ
- Finance IT News: ఇది శిక్ష-శిక్షణా.. TCS టెక్కీల కన్నీళ్లు.. అన్నంతపని చేసేసిన టెక్ దిగ్గజం..
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
పుష్ప విలన్ గోల మళ్ళీ మొదటికొచ్చింది.. సుకుమార్‌కి హ్యాండ్ ఇచ్చిన మరో హీరో
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోల మధ్య చాలా వరకు స్నేహ భావం ఎక్కువవుతోంది. మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి కొందరు ఏ మాత్రం నో చెప్పడం లేదు. ఇక క్యారెక్టర్ బావుంటే ఓ వర్గం యువ హీరోలు వారి రేంజ్ ని లెక్క చేయకుండా నటిస్తున్నారు. ఆ పాత్రలు సినిమాలకు చాలానే ఉపయోగపడుతున్నాయి. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప కోసం కూడా దర్శకుడు సుకుమార్ గత కొంత కాలంగా ఒక హీరో కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు.
నెవర్ బిఫోర్ అనేలా..
ఆర్య నుంచి మొదలైన సుకుమార్ బన్నీ ప్రయాణం ఇప్పుడు. పుష్పతో మరో లెవెల్ కి చేరుకోనుంది. నెవర్ బిఫోర్ అనేలా సుకుమార్ చేస్తున్న ఈ ప్రయత్నం అభిమానుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. పైగా బన్నీ కెరీర్ లోనే మొదటి పాన్ ఇండియా సినిమాగా రూపొందుతుండడంతో పాత్రలన్ని కూడా బలంగా ఉండాలని స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు.
ఆ స్క్రీన్ ప్లే రేంజ్ పెరగాలి అంటే..
అసలు విషయాలోకి వస్తే.. సినిమాలో హీరో పాత్రకు ధీటుగా ఒక ఓవర్ఫుల్ పోలీస్ పాత్ర ఉంటుందట. గంధపు చెట్ల స్మగ్లింగ్ లో తెలివిగా ఆలోచించె కథనాయకుడిని పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ వేసే ప్లాన్స్ కూడా చాలా కొత్తగా ఉంటాయట. సుకుమార్ సినిమాల్లో మైండ్ గేమ్స్ ఎలా ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఆ స్క్రీన్ ప్లే రేంజ్ పెరగాలి అంటే ఆర్టిస్టులు కూడా హై రేంజ్ స్టార్స్ అయ్యి ఉండాలి.
అతను అందుకే రిజెక్ట్ చేశాడు
అందుకే సుకుమార్ ఆ స్పెషల్ పాత్ర కోసం చాలా రోజులుగా సెర్చింగ్ చేస్తున్నాడు. ముందుగా విజయ్ సేతుపతిని ఫైనల్ చేసిన విషయం తెలిసిందే. అతను ఎదో రెమ్యునరేషన్ తక్కువ ఆఫర్ చేయడం వలన ఒప్పుకోలేదని రూమర్స్ వచ్చాయి. కానీ అది నిజం కాదు. ఆల్ రెడీ విజయ్ చాలా సినిమాలకు కమిట్మెంట్ ఇవ్వడంతో డేట్స్ అడ్జస్ట్ చేయడం కుదరకపోవచ్చని రిజెక్ట్ చేయాల్సి వచ్చింది.
నారా రోహిత్ కూడా రిజెక్ట్ చేశాడా?
ఇక ఫైనల్ గా యువ హీరో నారా రోహిత్ ని ఫిక్స్ చేస్తున్నట్లు రూమర్స్ వచ్చాయి. అందుకే కొత్త లుక్ కూడా సిద్ధం చేసినట్లు టాక్ వచ్చింది. కానీ అందులో నిజం లేదట. అసలే సక్సెస్ లు లేక హీరోగా నిలదొక్కుకోలేకపోతున్న సమయంలో పుష్ప లాంటి సినిమాలో నెగిటివ్ రోల్స్ చేస్తే బాగానే ఉంటుంది కానీ.. చాలా రిస్క్ తో కూడుకున్న పని అని రోహిత్ సున్నితంగా ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో సుకుమార్ మరో యాక్టర్ కోసం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.