తమన్నా బీర్లు గొడవ
హ్యాపీ గర్ల్ తమన్నా త్రాగుడు వ్యవహారంపై రోజుకో కథనం బయిటకు వస్తోంది. తాజాగా ఆమె రోజుకు రెండు బీర్లు కొట్టిగానీ పడుకోవటం లేదని రూమర్ బయిలుదేరింది. తమిళంలో ఆమె హవా ప్రారంభంకావటంతో ఈ తరహా రూమర్స్ మొదలయ్యాయని అంటున్నారు. వారు చెప్పేదాని ప్రకారం సన్నగా ఉన్న తమన్నా తన సన్నిహితుల సలహా మేరకు కాస్త ఒళ్ళు చేయటానికి బీర్ ని ఆశ్రయిస్తోందని అంటున్నారు. ఇంకొంచెం బొద్దుగా ఉంటేనే సౌతిండియన్ ప్రేక్షకులు ఇష్టపడతారనీ ఆమెకు చెప్పటం కొంపముంచిందంటున్నారు. మరికొందరు కెరీర్ పై దృష్టిపెట్టాల్సిన ఈ టైమ్ లో మందు మీద దృష్టి పెట్టటమేమిటని విమర్శలు చేస్తున్నారు. ఓ తమిళ టీవీ ఛానెల్ సైతం ఈ రూమర్ కి మరింత ప్రచారం కల్పించేలా న్యూస్ ని ప్రసారం చేయటంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. నమిత, నయనతార, త్రిష వంటివారిపై సైతం మందు కొడుతున్న ఫొటోలు, వీడియోలు చూపుతూ కథనాలు రావటం తెలిసిందే.


Click it and Unblock the Notifications











