twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో హిందీ చిత్రం ఓకే చేసిన తమన్నా

    By Srikanya
    |

    ముంబై: తెలుగు నుంచి హిందీలోకి వెళ్లిన వాళ్లలో తమన్నానే టాప్ గా నిలబడేలా ఉందు. ఒక సినిమాకూడా విడుదల కాకుండానే తమన్నాకు ఆఫర్స్ వరసగా వచ్చి పడుతున్నాయి. ఆమె తాజా చిత్రం హిమ్మత్ వాలా.. ట్రైలర్స్ చూసిన బాలీవుడ్ జనం ఆమెచుట్టూ చక్కర్లు కొడుతున్నారు. దాంతో తమన్నా హిందీలో మరో అవకాశాన్ని దక్కించుకొన్నట్లు సమాచారం. అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించబోయే చిత్రంలో తమన్నా హీరోయిన్ గా ఎంపికైంది. ఈ యేడాది చివర్లో షూటింగ్ మొదలవుతుంది. హిమ్మత్ వాలా చిత్రం మార్చి 29 న విడుదల అవుతుంది.

    వివరాల్లోకి వెళితే.. హిమ్మత్‌వాలా సినిమాతో అజయ్‌దేవగన్‌తో కలిసి బాలీవుడ్‌ తెరపై కనిపించబోతున్న తమన్నా భాటియా హిందీలో రెండో ప్రాజెక్ట్‌నుకూడా ఒప్పుకుంది. ఈసారి అక్షయ్‌ కుమార్‌తో ఆమె జోడీ కట్టబోతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత రమేష్‌ తౌరాని రచయితలద్వయం సాజిద్‌-ఫర్హాద్‌ల దర్శకత్వంలో నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా ఈ ఏడాది ఆఖరులో ప్రారంభం కానున్నట్లు భోగట్టా.

    అక్షయ్‌ కుమార్‌, తన సన్నిహితుడైన సాజిద్‌ ఖాన్‌ నిర్మిస్తున్న హిమ్మత్‌వాలా ప్రచార చిత్రాలను చూశాడని, దీంతో అతను, రమేష్‌ తౌరాని కలిసి తమ కొత్త చిత్రంలో తమన్నాను తీసుకోవాలని నిర్ణయించారని బాలీవుడ్‌ వర్గాలు తెలిపాయి. రచయితలద్వయం సాజిద్‌-ఫర్హాద్‌లు రూపొందించిన స్క్రిప్ట్‌ను అక్షయ్‌ ఓకే చేశాడనికూడా వెల్లడించాయి. సాజిద్‌-ఫర్హాద్‌లు ఇంతకుముందు గోల్‌మాల్‌, సింగమ్‌, డబుల్‌ ధమాల్‌, హౌస్‌ఫుల్‌ 2, బోల్‌ బచ్చన్‌ తదితర సినిమాలకు రచన చేశారు. ఈ సినిమాను రమేష్‌ తౌరనీ నిర్మిస్తారు. సాజిద్‌-ఫర్హాద్‌ ద్వయం దర్శకులు.

    English summary
    Tamanna's Himmatwala is releasing this March 29th. Even before the film's release, she reportedly bagged another big movie in Bollywood opposite Akshay Kumar. Known as 'Milky beauty', Tamanna's dance movements in the trailers of Himmatwala caught the attention of Bollywood filmmakers and the babe is now flooded with offers. Whereas in Telugu, she has only one film on her hand, which is Naga Chaitanya's film a remake of Tamil hit, Vettai.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X