రామ్ చరణ్ సాక్షిగా తమన్నా తప్పు చేసిందా?
రామ్ చరణ్, తమన్నా ఇద్దరూ కలసి రీసెంట్ గా తిరుమల తిరుపతి దేవస్ధానానికి వెళ్ళి భగవంతుడుని దర్శించుకున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ దేవాలయ సంప్రదాయం ప్రకారం చీర కానీ, సల్వార్ కమీజ్ కానీ కట్టుకుని మహిళా భక్తులు భగవంతుడుని దర్శించుకోవాలి. అయితే తమన్నా మాత్రం అవేమీ పట్టించుకోకుండా జీన్ ప్యాంట్, టీ షర్ట్ వేసుకుని వచ్చింది. ఇది చాలా మంది భక్తులు మాత్రమే కాక రామ్ చరణ్ సైతం సాక్ష్యంగా ఉన్నారు. అయితే రామ్ చరణ్ ఏమీ ఆమెను వారించినట్లుగా లేరు. అయితే దీన్ని కొందరు దైవ భక్తులు సీరియస్ గా తీసుకుంటున్నారు. తమిళనాడుకు చెందిన మీడియా అప్పుడే ఈ ఇష్యూపై తమదైన నిరసన తెలియచేస్తూ కథనాలు ప్రసారం చేసింది. అయితే తమన్నా మాత్రం ఈ విషయమై మాట్లాడేందుకు మీడియాకు అందుబాటులో లేదు. ఇక ప్రస్తుతం తమన్నా..రామ్ చరణ్ సరసన రచ్చ చిత్రం చేస్తోంది. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది.
తిరుపతి దగ్గరలో షూటింగ్ జరుగుతూ బ్రేక్ లో ఇలా దర్శనానికి వచ్చారు. ఇక మెగా సూపర్‌గుడ్ పతాకంపై ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏమైంది ఈ వేళ చిత్రంతో దర్శకుడుగా మారిన సంపత్ నంది ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు. అలాగే ఈ సినిమా కోసం కళా దర్శకుడు ఆనంద్‌సాయి ప్రత్యేకంగా ఓ సెట్‌ని తీర్చిదిద్దారు. మొదటి షెడ్యూల్ ని శ్రీలంకలో హీరో, హీరోయిన్స్ పై పాటను షూట్ చేసారు. వందశాతం మాస్ చిత్రమిదని, కమర్షియల్ అంశాలతో కూడిన చరణ్ పాత్ర తప్పకుండా అన్ని వయసులవారికీ నచ్చుతుందని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. ఈ చిత్రానికి సమర్పణ: ఆర్.బి.చౌదరి, సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి.


Click it and Unblock the Notifications











