Don't Miss!
- News మోదీ కరుణించిన ఎన్నికల కమీషన్ షాక్ ఇచ్చింది, తిరుగులేని నాయకుడికి రివర్స్ గేర్ !
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Sports DC vs SRH: అందుకే ఉనాద్కత్‌ను పక్కనపెట్టాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
హాట్ టాపిక్: చిరు హిట్ చిత్రం రీమేక్ లో తమన్నా
ముంబై : చిరంజీవి కెరీర్ లో సూపర్ హిట్ గా నిలించిన 'ఠాగూర్' చిత్రం ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ హీరోగా చేయనున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా తెలుగులో జ్యోతిక చేసిన పాత్రలో తమన్నా నటించనుందని సమాచారం. ఈ మేరకు బాలీవుడ్ పత్రికలు..ఆమె సైన్ చేసిందంటూ రాసుకొచ్చాయి. బాలీవుడ్ వర్గాలు చెప్పినదాన్ని బట్టి బాలీవుడ్ దర్శక నిర్మాత సంజయ్ లీలా బన్సాలీ మరో నిర్మాత విపుల్ షాతో కలిసి నిర్మిచనున్నారు. హిందీ రీమేక్ చిత్రానికి జయం రాజా దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది.
విజయకాంత్ హీరోగా ఎ.ఆర్.మురగదాస్ దర్శకత్వంలో 2002 సంవత్సరంలో విడుదలైన తమిళ చిత్రం 'రమణ' బాక్సాఫీసు వద్ద ప్రకంపనలు రేకెత్తించింది.అదే చిత్రం చిరంజీవి, శ్రియ జంటగా వి.వి.నాయక్ దర్శకత్వంలో తెలుగులో 'ఠాగూర్'గా విడుదలై రికార్టులు సృష్టించింది. ప్రస్తుతం ఈ చిత్రం హిందీలో రీమేక్ కానుందనే వార్తలు అంతటా ఆసక్తి కలిగిస్తున్నాయి. అవినీతి ప్రధానాంశంగా 'రమణ', 'ఠాగూర్' చిత్రాలు నిర్మితమయ్యాయి.
ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితులు ఈ సినిమా హిందీలో రావడానికి దోహదం చేస్తున్నాయి. అన్నా హజారే ఓ వైపు అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఈ చిత్రంలోనూ ఏసీఎఫ్ పేరుతో అవినీతికి పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షిస్తాడు హీరో. ఓ ప్రొఫెసర్ అవినీతికి వ్యతిరేకంగా పోరాటమే కథాంశంగా సినిమా రూపొందింది. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని వెల్లడిస్తామన్నారు.
ప్రస్తుతం తమన్నా నటించిన రెబెల్ త్వరలో విడుదల కానుంది. 'కెమెరామాన్ గంగతో రాంబాబు' సెట్స్‌పై ఉంది. ఇవిగాక మరికొన్ని ప్రాజెక్ట్‌లు కూడా తమన్నా చేతిలో ఉన్నాయి. రెబెల్ చిత్రంలో ప్రభాస్ సరసన ఆమె నటించింది. మరో ప్రక్క తమన్నా ఇప్పటికే 1981 లో విడుదలైన సూపహ్ హిట్ 'ఊరికి మొనగాడు' హిందీ రీమేక్ లో చేస్తోంది. జనవరి 2013 నుంచీ ఠాగూర్ రీమేక్ మొదలు కానుంది.