దర్శకుడు వివి వినాయిక్ కి తమన్నా కండీషన్ పెట్టిందా?
వివి వినాయిక్ తాజా చిత్రం బద్రీనాధ్ లో తమన్నా చాలా హాట్ గా నటించినట్లుగా స్టిల్స్ వెలబడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేఫధ్యంలో ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో సర్కులేట్ అవుతోంది. అది తమన్నా ఈ చిత్రంలో బికినీ వేసుకునే సన్నివేశంలో నటించిందని, అయితే ఆ స్టిల్స్ బయిటకు వస్తే సినిమా విడుదలకు ముందే అసభ్యకరమైన ముద్ర పడే అవకాశముందని, అందుకే దర్శకుడు వివి వినాయిక్ ని ఆ సీన్ చిత్రీకరణ సమయంలో స్టిల్ కెమెరాలు అనుమతించటానికి వీల్లేకుండా చేస్తానంటేనే ఆ సీన్ చేస్తానని ఒప్పుకుందని, అందుకే బికినీ సీన్ కి చెందిన స్టిల్స్ బయిటకు రావటం లేదని చెప్తున్నారు. అయితే కొందరు మాత్రం దీనని కేవలం రూమర్ గానే కొట్టిపారేస్తున్నారు. తమన్నా చేత బికినీ వేయించే అంత తెలివితక్కువ వాడు వినాయిక్ కాదని, బికినీ వేయటానకి తగిన పర్శనాలిటి తమన్నాకు లేదని అంటున్నారు. అయితే సినిమాలో బికినీ సీన్ ఉందని ప్రమేషన్ లో భాగంగా వదిలిన రూమర్ అని మరి కొందరు విశ్లేషించటం విషేషం. ఇక బద్రీనాధ్ చిత్రం ఈ నెల పదవ తేదీన విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











