కొరటాల దర్శకత్వంలో చిరు 152వ చిత్రం.... హీరోయిన్ ఖరారైందా?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్న 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన కొరటాల శివ దర్శకత్వంలో 152వ సినిమా చేయబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
చిరు-కొరాటాల ప్రాజెక్టుకు సంబంధించి తాజాగా మరో ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఇందులో చిరంజీవికి జోడీగా తమన్నాను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. తమన్నా గతంలో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి మెగా హీరోలతో జతకట్టింది. తాజాగా ఆమె పేరు చిరంజీవి సినిమాకు వినిపిస్తుండటం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.

గతంలో ఓసారి రామ్ చరణ్ సినిమా ఆడియో వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ.... తమన్నా టాలెంటుపై ప్రశంసలు గుప్పించారు. తమన్నాతో కలిసి నటించాలని ఉందని ఆ సమయంలో చిరంజీవి సరదాగా వ్యాఖ్యానించారు కూడా. చిరంజీవి అపుడు సరదాగా అన్న విషయం త్వరలో నిజం కాబోతోందని తెలుస్తోంది.
ప్రస్తుతం చిరంజీవి తన 151వ సినిమా 'సైరా'లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ 2019లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇది పూర్తయిన తర్వాత కొరటాల శివతో ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. సోషల్ మెసేజ్‌తో పాటు పూర్తి కమర్షియల్ హంగులతో ఈ సినిమా ఉండబోతోందని తెలస్తోంది.


Click it and Unblock the Notifications











