అల్లు అరవింద్ తో పదిలక్షలు కోసం గొడవ పెట్టుకోలేదు: తమన్నా
తమన్నా, నాగచైతన్యల కాంబినేషన్ లో అల్లు అరవింద్ 100% లవ్ అనే చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో డబ్బింగ్ చెప్పేందుకు తమన్నా పదిలక్షలు డిమాండ్ చేసిందని, ఆ మొత్తాన్ని ఇవ్వకుండా అల్లు అరవింద్ ఈ విషయమై నిర్మాతల మండలిలో కంప్లైంట్ చేసారని వార్తలు వచ్చాయి.అయితే వీటిని ఖండిస్తోంది తమన్నా. అవన్నీ బేస్ లెస్ రూమర్స్ అని కొట్టి పారేస్తోంది. తాను ఇప్పుడు తన కెరీర్ పై శ్రద్ద పెట్టానని,ఇలాంటి సిట్యువేషన్ లో పది లక్షలుకోసం ఓ నిర్మాతతో గొడవకు దిగనని ఆమె అంటోంది. ప్రస్తుతం తమన్నా..అల్లు అర్జున్ సరసన బద్రీనాధ్ చిత్రంలోనూ, ఎన్టీఆర్ సరసన సురేంద్రరెడ్డి చిత్రంలోనూ చేస్తోంది. ఇక అల్లు అరవింద్ తన బ్యానర్ లో నిర్మాణమవుతున్న రెండు చిత్రాలుకు గుత్త బేరంగా చాలా తక్కువ రేటుకు మాట్లాడాడని, అందుకే డబ్బింగ్ విషయమై ఆమె ఎగస్ట్రా ఎమౌంట్ అడిగిందని అంతటా వినపడుతోంది.


Click it and Unblock the Notifications











