'ఆర్య' సీక్వెల్ని నేనే వదులుకున్నా

By Staff

Tamanna
"నన్నేమి వాళ్ళు వద్దనుకోలేదు...నా అంతట నేనే ఆ పాత్రని వదులుకున్నా!" అంటోంది తమన్నా. 'హ్యాపీడేస్' తో పాపులర్ అయిన ఈ బ్యూటీ 'కాళిదాసు' లో హాట్ గా నర్తించి కుర్రాళ్ళ హార్ట్ బీట్ గా మారింది. దాంతో ఆమెను అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందనున్న 'ఆర్య' సీక్వెల్‌లో మొదట అనుకున్నారు. కానీ తర్వాత ఆమె కాదు కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలిసింది. దాంతో తెరవెనుక యేమైందో నని అందరూ రకరకాలుగా అనుకున్నారు. కొందరైతే తమన్నా బదులు కాజల్‌ని తీసుకోవాలన్నది అల్లు అర్జున్ లేదా సుకుమార్‌లలో ఒకరి నిర్ణయమని అంతా అనుకున్నారు.

అయితే నెగిటివ్ గా ప్రచారమవుతున్న ఆ వార్తలు ఆమె చెవిని పడినట్లున్నాయి. దాంతో ఇప్పుడామె ఆ సినిమాను తానే వదలుకున్నానని చెబుతోంది. "ఒకే సమయంలో ఎన్ని సినిమాలని చేయను? ఇప్పటికే రెండు సినిమాల్లో చేస్తున్నా. మరో రెండు సినిమాలు ఒప్పుకున్నా. అందుకే నా డేట్లు అడ్జస్ట్ కావడం కష్టమని నిర్మాతకు సున్నితంగా చెప్పా. వచ్చే యేడాది తప్పకుండా ఒక సినిమా చేస్తానని ఆయనకు హామీ ఇచ్చా. ఆయన నా సమస్యను అర్ధం చేసుకున్నారు" అని తెలిపింది తమన్నా.

ఇటీవలే అక్కినేని మనవడు సుశాంత్ సరసన 'కాళిదాసు'లో గ్లామర్‌తో మెప్పించిన ఆమె మరి కొద్ది రోజుల్లో రవికృష్ణతో 'నిన్న నేడు రేపు' సినిమాలో కనిపించబోతోంది. సిద్ధార్థ్‌తో 'కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా' సినిమా చేస్తోంది. పవన్ కల్యాణ్ 'పులి'లోనూ ఆమె పేరు వినిపిస్తోంది గానీ, ఇంకా ఫైనల్ కాలేదు.యేదైమైనా వరస ఆఫర్స్ తో దూసుకుపోతున్న ఆమె కెరీర్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X