తండ్రితో తమన్నాకు తలనొప్పి?

By Staff

Tamanna
హ్యాపీడేస్ బ్యూటి తమన్నా తనదైన శైలిలో సినిమాలు ఎంచుకుంటూ వెళ్తున్న సమయంలో తోడుండే తండ్రే తలనొప్పిగా మారుతున్నాడని చెప్పుకుంటున్నారు.కారణం ఆమె తండ్ర సంతోష్ భాటియాకి చిన్నప్పుడు నుండి సినిమాలంటే పిచ్చి. అప్పట్లో సినిమాల్లో ట్రై చేసాడు గానీ వర్కవుట్ కాలేదు. జీవితంలో పడిపోయిన ఆయన తనను తన కూతురు చూసుకుంటూ చిన్నప్పటి నుంచి ఆమెను నటన వైపు ప్రేరేపిస్తూ కృషి చేసాడు.

ఆయన ఆశలు ఫలించి ఇవాళ తమన్నా సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఎదిగింది. రాబోయో రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ వంటి పెద్ద స్టార్ల సినిమాలో సైతం నటించటానికి కమిట్ అయ్యింది. ఈ పరిస్ధితుల్లో ఆమె తండ్రి ఆమెను నిర్మాతలుకు రికమెండ్ చేసి చిన్న చిన్న వేషాలు ఇప్పించమని పీకుతున్నాడని సమాచారం. ఆ పోటు భరించలేక కల్లూరి సినిమాలో ఆయనకు ఓ నిముషం పాత్ర ఇచ్చారు.

అప్పటినుంచి మరీ ఆయనకు ఆ పిచ్చి బాగా పెరిగిపోయి దర్శక,నిర్మాతలతో డైరక్ట్ గా బేరానికి దిగుతున్నాడు. అందులోనూ కూతరు డేట్స్ తానే మేనేజర్ లా చూస్తూండటంతో ఆ టార్చర్ మరీ ఎక్కువయిందంటున్నారు. అలా ఆమెకు మంచి బ్యానర్స్ లో ఆఫర్స్ సైతం పోయాయని తెలుస్తోంది. ఇక ఈ భాధ పడలేక ఆమె తల్లి రజనీ,సోదరుడు ఆనంద్ భాటియాల సాయం కోరుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X