ఇలియానాను ఫాలో అవుతోందట
తమిళ సినిమాలపై త్రిష, నయనతార లాంటి మేటి హీరోయిన్లు ఫోకస్ తగ్గించడంతో, తమన్నాకు పెరిగిన డిమాండ్ ని తమన్నా బాగానే క్యాష్ చేసుకుంటోంది. తమిళం నుంచి తెలుగులోకి డబ్బింగ్ అవుతోన్న తమన్నా సినిమాల్ని చూస్తోంటే, ఎక్కువగా ఇలియానాని అనుకరిస్తున్నట్టు కనిపిస్తోంది. తమిళ సినిమా ఇండస్ట్రీలో తమన్నాకి ఇప్పుడు అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే తమన్నాకి తమిళనాట కురుస్తోన్న కాసుల వర్షం అంతా ఇంతా కాదు.
డాన్స్ దగ్గర నుండి బాడీలాంగ్వేజ్ దాకా అన్ని విషయాల్లోనూ ఇలియానాని అనుకరిస్తోందిప్పుడు తమన్నా. ఇదే విషయమై ఆమెను ప్రశ్నిస్తే, తన స్టయిల్ తనదేననీ, ఎవర్నీ అనుసరించాల్పిన అవసరం తనకు లేదనీ అంటోంది. ఎవరో గిట్టనివారు తనపై చేస్తోన్న దుష్ర్పచారం తప్ప, తానెవర్నీ ఇమిటేట్ చేయబోనని చెబుతోంది తమన్నా.


Click it and Unblock the Notifications











