నారా వారసుడుతో తమన్నా?

By Staff

Tamanna
'రాజకుమారుడు'తో మహేష్ నూ, 'చిరుత'తో రామ్ చరణ్ తేజను పరిశ్రమకు పరిచయం చేసిన క్రెడిట్ అగ్రనిర్మాత అశ్వనీదత్ దే. ఇప్పుడు ఆయన మరో నారా రోహిత్ ని హీరోగా పరిచయం చేయనున్నారనేది తెలిసిన విషయమే. నారా రోహిత్ మరెవరో కాదు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారాచంద్రబాబు సోదరుడైన నారా రామమూర్తినాయుడి తనయుడు. ఇక ఈ చిత్రంలో అతని ప్రక్కన హీరోయిన్ గా ఎవరు చేస్తే బావుంటుంది అనే దానికి రకరకాలగా ఆలోచించి చివరకు తమన్నాని సెలక్ట్ చేసినట్లు సమాచారం. స్క్రిప్టు వర్క్ పూర్తయిన ఈ సినిమా ఈ నెల ఇరవై ఏడున లాంఛనంగా ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నారని విశ్వసనీయ సమచారం.

ఇక ఈ సినిమా నిర్మాణం కూడా రాజకీయంగా ఓ స్ట్రాటజీ ప్రకారమేనంటున్నారు. నిరాశచెందిన నారా రామ్ముర్తి నాయుడు బుజ్జగించటానికే ఈ ప్రయత్నం అని అంటున్నారు. చంద్రబాబు సలహాపైనే ఈ నిర్ణయానికి అశ్వనీదత్ వచ్చాడని తెలుస్తోంది. ఇక ఈ చిత్ర నిర్మాణానికి అయ్యే ఖర్చను కూడా బాబే భరించే అవకాశాలనున్నాయని గుసగుసలువినపడుతున్నాయి. గతంలో అశ్వనీదత్ చాలా మంది తెలుగు వారస హీరోలను విజయవంతంగా లాంచింగ్ చేసిన అనుభవంతో ఈ ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.

ఇక ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్న దంతులూరి చైతన్య ప్రస్తుతం హ్యాపీడేస్ నికిల్ హీరోగా బసంతి అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. మొదట సురేష్ ప్రొడక్షన్స్ లో వినపించిన ఈ స్క్రిప్టు అక్కడ ఓకే కాకపోవటంతో అశ్వనీదత్ దగ్గరకు చేరింది. కొత్త బంగారు లోకం సినిమాకు పనిచేసిన టీమ్ లో కొంతమంది టెక్నికల్ ఈ చిత్రానికి సపోర్టు చేయనున్నారు. ప్రస్తుతం అశ్వనీదత్ తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చిరంజీవి ప్రజారాజ్యం అధినేతగా కాక ఓ టాప్ హీరోగా ఈ ప్రారంభోత్సవానికి పిలవటానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.తమన్నా హీరోయిన్ అవటం ఈ సినిమాకు ప్లస్ అయ్యే అవకాసం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X