»   » అల్లు అరవింద్ ని ముప్పతిప్పలు పెడుతోన్న హీరోయిన్..!

అల్లు అరవింద్ ని ముప్పతిప్పలు పెడుతోన్న హీరోయిన్..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమాలపై ఎంతైనా ఖర్చు పెడతాడనే పేరున్న నిర్మాత అల్లు అరవింద్ కి ఆర్టిస్టులకి పారితోషికాలు ఇచ్చే విషయంలో మాత్రం గీసి గీసి బేరాలాడతాడనే బ్యాడ్ నేమ్ ఉంది. హీరోలు ఎలాగూ తమ ఫ్యామిలీ వాళ్లే కాబట్టి వాళ్లకి సినిమా రిజల్ట్ ని బట్టి డబ్బులిస్తుంటాడు. ఇక ప్రొడక్షన్ మిగతా నటీనటులు మాత్రం గీతా ఆర్ట్స్ సినిమా అంటే తిట్టుకుంటూ ఉంటారు. అలాగే తెలుగులో మంచి బ్రేక్ కోసం చూస్తున్న తమన్నాని ఒకేసారి రెండు సినిమాల్లో తీసుకుని నామమాత్రపు పారితోషికం ఇవ్వడానికి అల్లు అరవింద్ ఒప్పందం చేసుకున్నాడు.

బద్రీనాథ్ సినిమాతో పాటు నాగచైతన్య, సుకుమార్ ల చిత్రంలో తమన్నాని హోల్ సేల్ గా బుక్క చేసుకున్నాడు. తెలుగులో బ్రేక్ కోసం చూస్తున్న తమన్నా తక్కువ మొత్తానికే నటించడానికి రెడీ అయింది. అయితే ఇంతలో తమన్నాకి తెలుగులో డిమాండ్ పెరిగింది. చాలా మంది అవకాశాలిస్తున్నారు. మరోవైపు తమిళ సినిమాలు ఎలాగో ఉన్నాయి. దాంతో తమన్నా అల్లు అరవింద్ సినిమాకి సరిగా డేట్లివ్వకుండా తప్పించుకు తిరుగుతోంది. ఆమె కారణంగా ఇప్పటికే పలు షెడ్యూల్స్ దెబ్బతిని కొంత నష్టం కూడా జరిగింది. అందరికీ టోకరా ఇచ్చే అల్లు అరవింద్ కే తమన్నా కాజా తినిపించిందని అతని బాధితులు సంబరపడుతున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu