తమన్నాకి కమల్ లిప్ కిస్?
కమల్ హాసన్ తన తదుపరి ప్రాజెక్టుకి హీరోయిన్ గా తమన్నాని అడిగినట్లు సమాచారం.దాంతో తమన్నాకి కమల్ హాసన్ లిప్ టు లిప్ కిస్ తప్పదంటూ చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి. గతంలోనూ కమల్ తనతో చేసిన హీరోయిన్స్ అందరితో ఈ తరహా ముద్దు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. అయితే తమన్నా తన డేట్స్ ఎడ్జెస్ట్ అవుతాయనో లేదనో చెప్పకుండానే ఈ తరహా రూమర్స్ వినపడటం ఆశ్చర్యపరుస్తోంది. ఇక కమల్ తన ఎ వెడ్నస్ డే రీమేక్ ఊహించినంతగా క్లిక్ కాకపోవటంతో ఒకింత నిరాశకు గురిఅయ్యాడని తెలుస్తోంది. తన తదుపరి ప్రాజెక్టుకు స్క్రిప్టు రెడీ అయిందనీ అది టోటల్ గా కామిడీగా ఉంటుందని దర్శకుడు కె.ఎస్.రవికుమార్ అయ్యే అవకాసం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం రవికుమార్..సూర్యతో ఘటికుడు చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు కమల్, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో దశావతారం వచ్చింది.


Click it and Unblock the Notifications











