హ్యాపీగర్ల్ తమన్నా ప్రేమలో పడిందనే వార్తలు ఫిల్మ్ సర్కిల్స్ లో బలంగా వినపడుతోంది. అయితే అతను మరెవరో కాదు. బొమ్మరిల్లు,నువ్వు వస్తానంటే నే వద్దంటానా వంటి సూపర్ హిట్ సినిమాల్లో చేసిన రొమాంటిక్ హీరో సిధ్ధార్ధ. వీరిధ్దరూ కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా సినిమాలో కలసి పనిచేస్తున్నారు. అప్పుడే ఈ ప్రేమ మొలకెత్తిందని చెప్తున్నారు. షూటింగ్ అయిపోగానే ఇద్దరూ ఒక్కసారిగా మాయమవటం, అలాగే సెట్స్ లో ఒకర్ని విడిచి మరొకరు ఉండలేనట్లుగా బిహేవ్ చేయటం చేస్తున్నారని చెప్తున్నారు. అసలు ఒకసారి పెళ్ళయి మరో ప్రక్క బాలీవుడ్ నటి సొహా అలీ ఖాన్ తో సరసం నడిపిన సిధ్ధార్ధ వలలో పడటం చాలామందికి నచ్చంటం లేదు. ఇప్పడిప్పుడే కెరీర్ గాడిలో పడుతున్న తమన్నా మరో సారి ఆలోచించుకుని ముందడగు వేస్తే బాగుంటుందంటున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ పబ్ లకు,పార్టీలకే కాక ఒకరిళ్ళకు మరొకరు వెళ్తున్నారని తెలుస్తోంది.
Story first published: Friday, December 12, 2008, 9:27 [IST]