హమ్మయ్య: అల్లు అరవింద్‌తో తమన్నా డీల్ క్లోజ్!
హ్యాపీడేస్ సినిమా భారీ విజయంతో ఉత్తరాది సినిమా రంగంలో దూసుకెలుతున్న హీరోయిన్ తమన్నా ప్రస్తుతం స్టార్ హీరోయిన్. తెలుగు సినిమాలకు కొంత కాలం దూరం అయిన తర్వాత తమిళంలో వరుస హిట్లతో రాణించిన అమ్మడు, మళ్లీ తెలుగులో భద్రీనాథ్, ఊసరవెల్లి సినిమాలతో అభిమానులకు అందాల విందు చేసింది. ప్రస్తుతం తమన్నా రెమ్యూనరేషన్ దాదాపుగా కోటి.
హ్యాపీడేస్ సినిమా విజయం తర్వాత ఆమె భవిష్యత్ ముందే ఊహించిన నిర్మాత అల్లు అరవింద్...ఆమె రేటు తక్కువగా ఉన్నప్పుడు మూడు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకున్నాడట. స్టార్ హీరోయిన్ రేంజ్ వచ్చినా, ప్రస్తుతం వేరే సినిమాలకు అంతకన్నా ఎక్కవ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నా.... ముందు చేసిన ఒప్పందం ప్రకారం అల్లు అరవింద్ సూచించిన సినిమాలకు పని చేస్తూ వస్తుంది తమన్నా. బన్నీతో బద్రీనాథ్ సినిమాతో పాటు, గీతా ఆర్ట్స్ బ్యానర్లో 100%లవ్, తాజాగా అరవింద్ డీల్ లో భాగంగానే రామ్ చరణ్ సరసన 'రచ్చ' సినిమాలో నటిస్తోందని తెలుస్తోంది.
పస్తుతం రచ్చ సినిమా షూటింగ్ పూర్తి కావస్తుండటంతో...త్వరలోనే అల్లు అరవింద్ డీల్ నుంచి తమన్నాకు విముక్తి కలుగనుందని, దీనిపై తమన్నా చాలా హ్యాపీగా ఉందనే వార్తలు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నాయి. ఇకపై ఇలాంటి డీల్స్ కుదుర్చుకుని నష్ట పోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని యోచిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











