మేకప్ బాయ్ కోసం చేజార్చుకున్న తమన్నా

By Bojja Kumar

కన్నడ భామ తమన్నా అందం గురించి ఎంత వర్ణించినా తక్కవే. పాలమీగడ లాంటి రూపు, అదరగొట్టే అందమైన నడుము, సొగసైన ఎత్తువంపులు, తాజా ఆపిల్ పండులా నిగనిగలాడే ముఖార విందం...అబ్బో అమ్మడు అందం గురించి ఎంత మాట్లాడినా తక్కువనే చెప్పాలి. తమన్నా మేకప్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. తన అందానికి మెరుగు దిద్దడానికి సొంతంగా ఓ మేకప్ బాయ్ ని కూడా పెట్టుకుంది. తన అందాన్ని చెక్కుచెదరకుండా చూసుకుంటున్న ఆ మేక్ బాయ్ అంటే తమన్నాకు ఎనలేని మమకారం. కానీ ఆ మమకారం కారణంగానే ఇప్పడు ఆమె ఓ భారీ సినిమా అవకాశాన్ని చేజార్చుకుందని ఫిల్మ్ నగర్ టాక్.

ఓ ప్రముఖ నిర్మాత తమన్నా హీరోయిన్‌గా ఓ సినిమా ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా సదరు సినిమా హీరోతో తొలుత ఫోటో షూట్ నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు ఆ ఫోటో షూట్లో పాల్గొనడానికి రావాల్సిందిగా ఆమెకు పిలుపు అందింది. తను రావాలంటే తనతో పాటు తన వ్యక్తిగత సిబ్బందికి కూడా బిజినెస్ క్లాస్ ఎయిర్ టిక్కెట్స్ బుక్ చేయాలని ప్రొడూసర్‌ను డిమాండ్ చేసింది. అయితే సదరు ప్రొడ్యూసర్ తమన్నా మాటలు పట్టించుకోకుండా తమన్నాకు, తమన్నా మదర్‌కు బిజినెస్ క్లాస్ టిక్కెట్లు బుక్ చేయించి, మిగతా వారికి సెకండ్ క్లాస్ టిక్కెట్స్ బుక్ చేయించాడు నిర్మాత. ఈ విషయం తెలిసిన తమన్నా తన మేకప్ మ్యాన్‌కు కూడా బిజినెస్ క్లాస్ టిక్కెట్ ఇప్పించాలని డిమాండ్ చేసిందట. దీంతో చిర్రెత్తిన సదరు నిర్మాత తమన్నాను తన సినిమా ప్రాజెక్టును తొలగించినట్లు సమాచారం. మరి ఆ నిర్మాత ఎవరు? అనేది మాత్రం కొన్ని కారణాల వల్ల ప్రస్తుతానికి బయటకు వెల్లడించలేక పోతున్నాం....

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X