తమన్నా తప్పుకుంది...అందుకే ఈ నెలంతా ఖాళీ
హైదరాబాద్: ప్రాజెక్టు ఫైనలైజ్ అయిపోయిన తర్వాత అందులోంచి హీరో కానీ హీరోయిన్ కానీ బయిటకు వచ్చేస్తే అందరి దృష్టీ ఆ ప్రాజెక్టుపైనే ఉంటుంది. ముఖ్యంగా పెద్ద ప్రాజెక్టులకు అలా జరగకుండా చూసుకుంటూంటారు. తాజాగా తమన్నా...బెల్లంకొండ సురేష్ తన కుమారుడు తో చేయనున్న చిత్రం నుంచి తప్పుకున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచరం. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో తన కొడుకు ప్రక్కన తమన్నాను తీసుకుూన్నారు. అయితే ఫైనాన్సియల్ క్రైసిస్ తో ఆ ప్రాజెక్టు పట్టాలు ఎక్కలేదు. దాంతో తమన్నా తన డేట్స్ వాడుకోలేదు కాబట్టి తర్వాత తాను ఎడ్జెస్ట్ చేయలేనని క్లియర్ గా చెప్పిందిట.
తమన్నా... టాలీవుడ్‌లో బిజీ స్టార్. అప్పుడప్పుడూ తమిళంలోనూ సినిమాలు చేసొస్తుంది. అది చాలదన్నట్టు బాలీవుడ్‌లో నిరూపించుకోవాలన్న తాపత్రయం టన్నులకొద్దీ ఉంది. అందుకే తమన్నా మహా బిజీ బిజీగా ఉంటుంది. సినిమాలు, షూటింగులు, షాపింగ్‌మాల్స్‌లో సందళ్లూ అంటూ క్షణం కూడా తీరిక ఉండదు. అలాంటి తమన్నాకు ఇప్పుడు కాస్తంత తీరిక దొరికింది.

అనుకున్న డేట్స్ ఇలా మిస్ కావటంతో... షూటింగులేం లేకపోవడంతో ఓ నెలరోజులు సెలవలు దొరికాయి. దాంతో ఎంచక్కా... ఇంట్లోవాళ్లతో గడుపుతోంది తమన్నా. ''అనుకోకుండా షూటింగుల మధ్య విరామం వచ్చింది. ఇంకేం ఆలోచించలేదు.. ఇంటికొచ్చేశా. ఈ సెలవలన్నీ వీళ్లకే. ఎప్పటి నుంచో చేయాలనుకొన్న పనులు ఈ విరామంలో పూర్తిచేస్తా. కొత్త ఉత్సాహంతో మళ్లీ షూటింగులకు హాజరవుతా'' అంటోంది తమన్నా. ప్రసుత్తం 'బాహుబలి'లో నటిస్తోంది.
అయితే ఇప్పుడు శ్రుతి హాసన్ ని ఈ ప్రాజెక్టులోకి తేవాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. హీరోయిన్ ఫైనల్ కాగానే ప్రాజెక్టు పట్టాలు ఎక్కుతుందంటున్నారు. అల్లుడు శ్రీను తో హిట్ కొట్టినా ఓవర్ బడ్టెట్ కావటంతో ఆ డబ్బు పూర్తిగా రికవరీ కాలేదని సమాచరం. దాంతో బయిట ప్రొడ్యూసర్స్ ఎవరూ స్పీడుగా బెల్లంకొండ కుమారుడుతో భారీ సినిమా చేయటానికి ముందుకు రాలేదు.


Click it and Unblock the Notifications











