రామ్ చరణ్ సినిమా నుంచి తమన్నా ఔట్
హైదరాబాద్ : రామ్ చరణ్, కృష్ణ వంశీ చిత్రంలో హీరోయిన్ గా తమన్నా ని ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే డేట్స్ ప్లాబ్లం వల్ల తమన్నా ఆ ప్రాజెక్టు నుంచి బయిటకు వచ్చిందని సమాచారం. దాంతో తమన్నా ప్లేస్ లోకి కాజల్ వచ్చి చేరింది. గతంలో కాజల్, కృష్ణ వంశీ కాంబినేషన్ లో చందమామ చిత్రం వచ్చింది. అలాగే కాజల్, కృష్ణవంశీ కాంబినేషన్ లో మగధీర,నాయక్ వంటి సూపర్ హిట్స్ ఉన్నాయి. దాంతో ఈ కాంబినేషన్ ని సెట్ చేసారు.
ఇక ఒకప్పుడు తమన్నా కాల్షీట్లు హాట్‌కేకులు. ఏ సినిమా చూసినా తమన్నానే. స్టార్ హీరోలతో ఆడిపాడింది. భారీ పారితోషికాల్ని అందుకొంది. బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. అక్కడ 'హిమ్మత్‌వాలా' సినిమా అంచనాలను తలక్రిందులు చేస్తూ.. ఫ్లాప్ అయ్యింది. ఆ పరాజయంతో దక్షిణాదిన కూడా తమన్నా జాతకం తిరగబడింది. ఇక్కడ సినిమాలూ లేవు. హిట్లూ లేవు. దాంతో తమన్నా క్రేజ్ ఒక్కసారిగా తగ్గిపోయింది. అయితే ఇప్పుడే క్రమంగా మళ్లీ పుంజుకొంటోంది.
మహేష్‌బాబు 'ఆగడు'లో అవకాశం అందుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు 'బాహుబలి'లో ఓ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో తమన్నా అవంతికగా కనిపించబోతోందట. వరుసగా రెండు పెద్ద సినిమాలు తన ఖాతాలో వేసుకొంది. మొత్తానికి తమన్నా కెరీర్ మళ్లీ స్పీడందుకొంది. ఇక మిగిలిన హీరోయిన్స్ కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందేనేమో..అంటున్నారు.


Click it and Unblock the Notifications












