అనుష్క మీద అక్కస్సుతోనే డైరెక్టర్ అలా చేశాడా...!?
'మిస్టర్ ఫర్ ఫెక్ట్' హిట్ తర్వాత ప్రభాస్ రెట్టించిన ఉత్సాహంతో చేస్తున్న సినిమా 'రెబల్'. లారెన్స్ దర్శకత్వంలో ఈ చిత్రం మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. ఇందులో కథానాయికలుగా మొదట్లో అనుష్క, దీక్షా సేథ్ లను తీసుకున్నారు. అయితే, 'కాంచన' సినిమాలో చేయడానికి అనుష్క నిరాకరించడంతో, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న లారెన్స్ ఈ ప్రాజక్టు నుంచి ఆమెను తప్పించాడని టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో, ఇందులో అనుష్క పోషించాల్సిన పాత్రకు తమన్నాను ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. తమన్నా ఎంత లక్కీ కాకపోతే ఇప్పటికే ఆమె చేతిలో మూడు ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అవే జూ ఎన్టీఆర్ తో 'ఊసరవెల్లి", రామ్ చరణ్ తో 'రచ్చ", రామ్ తో 'ఎందుకంటే ప్రేమంటే" చిత్రాలు ఉన్నాయి. అంటే వచ్చే ఏడాది వరకు తమన్నా చాలా బిజీ హీరోయిన్ అన్నమాట. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు కృష్ణంరాజు ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











