తమన్నా రెమ్యునేషన్ ఎంత

By Srikanya

హైదరాబాద్ : రెండు డిజాస్టర్స్ వచ్చాయి కదా రెమ్యనేషన్ ఏమన్నా తమన్నా తగ్గిస్తోందేమోనని దర్శక,నిర్మాతలు ఆశపడ్డారు. అయితే వారి ఆశను నిరాశపరుస్తోంది. ఖచ్చితంగా కోటిన్నర ఇవ్వాల్సిందే అని తేల్చి చెప్తోంది. తనకు బడ్జెట్,హీరో,బ్యానర్, భాషతో సంభంధం లేదని,కేవలం తన రెమ్యునేషన్ ఎంతో చెప్పి తర్వాత కథ చెప్పండని అంటోందని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. అయినా సరే తమన్నా చేతిలో వరస సినిమాలు ఉన్నాయి.

ప్రస్తుతం ఆమె హిందీలో 'ఇట్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌' , తెలుగులో ఆగడు చిత్రాల్లో నటిస్తోంది. అలాగే బాహుబలి షూటింగ్ లో ఈ రోజు నుంచి పాల్గొంటోంది. ఎన్టీఆర్, పూరి చిత్రం, నేను అంబాని సీక్వెల్ లో ఆర్య సరసన, అల్లుడు శ్రీను చిత్రంలో ఐటం సాంగ్ చేస్తూ బిజీగా ఉంది. ఇంకా నాలుగైదు ప్రాజెక్టులు ఆమె సైన్ చేయనుంది.

Tamanna refuses to slash PAY

తన సినీ జీవితంలో ఇప్పటిదాకా పూర్తిస్థాయిలో సంతృప్తి ఇచ్చిన పాత్ర ఏదీ లేదని చెబుతోంది. 'నాకు ఎప్పట్నుంచో విలన్ షేడ్స్ లున్న పాత్ర చేయాలనుంది. ఆ అవకాశం వచ్చి, అది బాగా పండితే.. అదే నాకు నచ్చిన పాత్ర అవుతుంది' అని చెబుతోంది తమన్నా . తమన్నా 'హమ్‌షకల్స్‌' కోసం ప్రచారం చేస్తూ బిజీ బిజీగా గడిపింది. ఆ సినిమా ఇటీవల విడుదల కావడంతో... వెంటనే 'బాహుబలి' కోసం రంగంలోకి దిగింది. ఈ సినిమాని ప్రమోట్ చేయటం మొదలెట్టింది. తొలి రోజున పాత్రకు అనువైన దుస్తులు ధరించి సరిచూసుకొంది. సోమవారం చిత్ర బృందంతో కలసి రిహార్సల్స్‌లో పాల్గొంది.

ఈ రోజు (మంగళవారం) నుంచి ఆమెపై సన్నివేశాల్ని చిత్రీకరిస్తారు. 'బాహుబలి' గురించి తమన్నా ప్రత్యేకమైన ఆసక్తి కనబరుస్తోంది. ఇలాంటి పాత్రను తొలిసారి పోషిస్తున్నానని, అందుకే ఎంతో ఆత్రుతగా ఉందని చెప్పుకొచ్చింది. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌ హీరో. తమన్నాని ఓ హీరోయిన్ గా ఎంపిక చేసుకొన్నారు. సినిమాలో బాహుబలి, శివుడు అనే రెండు పాత్రల్లో ప్రభాస్‌ కనిపిస్తారు. శివుడు పాత్ర సరసన తమన్నా నటిస్తోంది.

ఈ సందర్భంగా ఆమె ఓ వీడియో ద్వారా 'బాహుబలి' కబుర్లు వినిపించింది. ''ఇదివరకు 'బాహుబలి'లాంటి సినిమాను నేనెప్పుడూ చేయలేదు. ఇలాంటి పాత్ర నాకు కొత్తే. అందుకే పాత్రకు తగిన దుస్తులు వేసుకొన్నప్పుడు, ఆ కేశాలంకరణతో ముస్తాబైనప్పుడు తెలియని అనుభూతి కలిగింది. సినిమాలో వైవిధ్యంగా కనిపిస్తాను'' అని చెప్పుకొచ్చింది తమన్నా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X