ఏ భాషలో నటించినా టాప్‌ లో ఉండటానికే ఇష్టపడతా..!

By Sindhu

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్స్ గా వుంటూ రెక్కలుగట్టుకొని బాలీవుడ్ కెళ్లి చేతులు కాల్చుకొన్న వారి లిస్ట్ లో అసిన్, శ్రియ, త్రిష, ప్రియమణి, లాంటి వారు ఉన్నారు. అయితే బాలీవుడ్ లో ఎన్ని ఆఫర్స్ వచ్చినా, ఎంత మంచి ఆఫర్స్ వచ్చినా అనుష్క, నయనతార లాంటి వారు సున్నితంగా తిరస్కరించారు. ప్రస్తుతం అదే కోవలోకి మిల్కీ బ్యూటీ తమన్న చేరింది.

ప్రస్తుతం తెలుగులో బిజీగా ఉన్న నాయికల్లో తమన్నా ఒకరు. ఓ పక్క అల్లు అర్జున్‌ తో బద్రీనాథ్, మరో పక్క నాగచైతన్యతో, ఇంకో పక్క ఎన్టీఆర్‌ తో సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారామె. ఇవిగాక మరికొన్ని పెద్ద సినిమాలు కూడా ఈ ముద్దుగుమ్మ ఖాతాలో ఉన్నాయని సమాచారం. కోలీవుడ్‌ లో 'నంబర్ వన్"గా... టాలీవుడ్‌ లో మంచి స్టార్‌ గా ఎదిగారు. మరి బాలీవుడ్ పయనం ఎప్పుడు..? అని తమన్నాని అడిగితే"?బాలీవుడ్ ఆఫర్లు నాకు చాలా వచ్చాయి.

కావాలనే వాటిని రిజక్ట్ చేశాను. నేను ఏ భాషలో నటించినా టాప్‌ లో ఉండటానికే ఇష్టపడతా. నా కోరిక తీరేదాకా మరో భాషవైపు చూడను. ప్రస్తుతం తెలుగు సినిమాపైనే నా దృష్టంతా. ఇక్కడ 'హ్యాపీడేస్" తర్వాత సరైన సక్సెస్‌ ని నేను చూళ్లేదు. ఆ లోటు తీరిన తర్వాత కానీ... బాలీవుడ్ గురించి ఆలోచించను. ఈలోగా బాలీవుడ్ నుంచి ఎలాంటి ఆఫర్ వచ్చినా వదిలేయాలని కఠోర నిర్ణయం తీసుకున్నాను. ప్రస్తుతం తెలుగులో నేను చేస్తున్న సినిమాలన్నీ ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్‌ లే . అన్నీ ఒకదానికొకటి సంబంధంలేని పాత్రలే. తప్పకుండా నా కెరీర్‌ కి అవి మంచి హెల్ప్ అవుతాయనుకుంటున్నాను" అని ఆశాభావం వ్యక్తం చేశారు మిల్కీబ్యూటీ తమన్నా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X