twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తమన్నా కోసం తపన పడుతున్న తండ్రి, కొడుకులు..!

    By Sindhu
    |

    టాలీవుడ్ లో అగ్రహీరోలలో నాగార్జున ఒకడు. మంచి అందగాడు, రతి మన్మథుడు కూడా. టాటీవుడ్ లో నాగార్జున అందం చూసి ఇష్టపడిని భామలు ఎవరు ఉండనడంలో సందేహం లేదు. ఇక అదే ఫ్యామిలీ నుండి వారసత్వం పుచ్చుకొని టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన వాడు నాగచైతన్య. నాగచైతన్య 'ఏమాయ చేసావె"తో టాలీవుడ్ జనాలను మాయచేసి మంచి పేరు తెచ్చుకొని 100%లవ్ సినిమాతో యూత్ ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు. దీంతో చైతన్యకు టాలీవుడ్ లో స్థానం సుస్థిరమైనదని అనుకుంటున్నారు.

    అయితే 100% లవ్ సినిమాలో నాగచైతన్య సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లో నాగార్జున చైతు ఈ సినిమాలో బాగా నటించాడని, తన ప్రక్కన తమన్నా కూడా చాలా బాగా చేసిందని, ఈ సినిమాలో వారిద్దరి మధ్య 100% కెమిస్ట్రి కుదిరిందని నాగార్జున అన్నాడట. ఆ సినిమాలో కాకుండా తమన్నా 'బద్రినాథ్" సినిమలో కూడా అల్లు అర్జున్ సరసన నటించింది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ శిల్పకళావేధికలో ఘనంగా జరిగింది. ఈ ఆడియో ఫంక్షన్ కి తమన్నా చాలా అందంగా తయారయ్యి వచ్చింది. ఈ ఫంక్షన్ లైవ్ ను చూసిన నాగార్జున తమన్నా అందాలకు దాసోహం అయ్యి తమన్నాను తన తరువాత సినిమాలో పెట్టుకోవాలను అనుకున్నాడట. ఇటు నాగచైతన్య కూడా 100%లవ్ లో ఇద్దరి మధ్య కెమిస్ట్రి బాగా కుదరడంతో చైతు కూడా తన తరువాత సినిమాలో తమన్నాతో చేయాలనే పట్టుదలతో ఉన్నాడట. అయితే వీరిద్దరి ఇలా అనుకుంటుంటే నాగార్జున అమల కొడుకు 'అఖిల్" కూడా తన మొదటి సినిమాను మిల్కీ బ్యూటీతో చేసి సినిమా రంగ ప్రవేశం చేయాలని అనుకుంటున్నాడని సమాచారం..

    English summary
    Nag to romance with Naga Chaitanya heroine Tamanna, Nagarjuna praising Tamanna acting in 100% Love, Nagarjuna select Tamanna in his next movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X